బిజినెస్​X Money App | ‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది..

X Money App | ‘ఎక్స్ మనీ’ వచ్చేస్తోంది..

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ ఒక సూపర్ యాప్‌గా మారేందుకు రెడీ అవుతోంది. ఎక్స్ మనీ పేరుతో తీసుకువచ్చే ఈ యాప్‌లో సోషల్ మీడియాతోపాటు షాపింగ్, ఇన్వెస్ట్‌మెంట్స్, బ్యాంకింగ్ సేవలు అందనున్నాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : X Money App | ఎలాన్ మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్ ’ను ఎవ్రిథింగ్ యాప్‌గా మార్చే పనిలో ఉన్నారు. వినియోగదారులు ఒకే ప్లాట్ ఫాంపై అన్ని సర్వీసులను యాక్సెస్ చేసేలా ‘ఎక్స్ మనీ’ అనే ఫైనాన్షియల్ సర్వీస్ ఫీచర్‌ను తీసుకు వచ్చే యోచనలో ఉన్నారు.

ఈ ఎక్స్ మనీ ద్వారా యూజర్లు నేరుగా డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చు. ఈ డిపాజిట్లపై దాదాపు 6 శాతం వడ్డీ కూడా చెల్లిస్తారని తెలుస్తోంది. అంతేకాదు ఈ యాప్ ద్వారా చేసే ట్రాన్జాక్షన్స్ పై 3 శాతం వరకు క్యాష్ బ్యాక్ ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఎక్స్ యూజర్ ఐడీతో స్పెషల్‌గా మెటల్ వీసా డెబిట్ కార్డును కూడా సంస్థ అందించనున్నారు. గూగుల్ పే (Google Pay) లేదా ఫోన్ పే లాగానే ఒకరి నుంచి మరొకరికి డబ్బును పంపుకోవచ్చు.

X Money App | ఈ యాప్ లో ఏఐ సేవలూ..

మస్క్ (Elon Musk)కు చెందిన ఎక్స్ ఏఐ డిజైన్ చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence) సేవలు ఈ సూపర్ యాప్‌లో అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏఐ అసిస్టెంట్ యూజర్ల ఖర్చులు, లావాదేవీలను ట్రాక్ చేయనుంది. ఇది యూజర్లు చేసే ఖర్చులను గమనించి, వాటిని కేటగిరీలుగా విడదీసి బడ్జెట్ మేనేజ్‌మెంట్‌లో సాయపడుతుందని భావిస్తున్నారు. ఎక్స్ ప్లాట్ ఫామ్‌లో ఉన్న క్రియేటర్లు తమ సంపాదనను ఇకపై ఇతర థర్డ్ పార్టీ యాప్స్‌ (Third-party Apps)తో సంబంధం లేకుండా నేరుగా ఎక్స్ మనీ ద్వారానే పొందొచ్చు. ప్రస్తుతం అమెరికాలోని పలు రాష్ట్రాల్లో దీనికి సంబంధించి పేమెంట్ లైసెన్సులను పొందినట్లు సమాచారం. త్వరలో బీటా వెర్షన్ నుంచి పూర్తి స్థాయిలో యూజర్లకు అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: Stock Market Gains | లాభాల్లో స్టాక్ మార్కెట్లు

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

India Assembly Election Shocks| ఒకే దెబ్బకు ముగ్గురు సీఎంలు ఔట్? ఐదు రాష్ట్రాల ఫలితాల్లో పొలిటికల్ సునామీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:India Assembly Election Shocks| ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల...

Vijay Trisha | టీవీకే చీఫ్​ విజయ్ ఇంటికి త్రిష..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Trisha | తమిళనాడు (Tamil Nadu)లో...

 Bengal BJP Rise | బెంగాల్​లో కమల వికాసం.. బీజేపీ విజయానికి కారణాలివే..

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bengal BJP Rise | పశ్చిమ బెంగాల్​లో...

Nizamabad Collectorate | కలెక్టరేట్​లో కలకలం.. మహిళ ఆత్మహత్యాయత్నం..

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Nizamabad Collectorate | నిజామాబాద్​ కలెక్టరేట్​ ఆవరణలో...