Kerala Political Update | కమ్యూనిస్ట్​ల పని ఖతం.. కేరళంలో కాంగ్రెస్​ జోరు

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్: Kerala Political Update | దేశంలో కమ్యూనిస్ట్​ పార్టీ (Communist Party)ల పని దాదాపు ఖతం అయింది. ఆ పార్టీ అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రం కేరళంను కూడా కోల్పోయింది. అధికార ఎల్​డీఎఫ్​కు కేరళం ప్రజలు షాక్​ ఇచ్చారు.

దేశంలో ఒకప్పుడు చాలా ప్రభావం చూపిన కమ్యూనిస్ట్​లు ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో తోక పార్టీలుగా మారిపోయారు. గతంలో పశ్చిమ బెంగాల్​ (West Bengal)లో సుదీర్ఘ కాలం అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీ తాజా ఎన్నికల్లో ఒక్క చోట కూడా ఆధిక్యంలో లేరు. కమ్యూనిస్ట్​ల కంచుకోటను మమత బెనర్జీ (Mamata Banerjee) బద్దలు కొట్టగా.. వారి స్థానంలోకి బీజేపీ వచ్చింది. సుదీర్ఘ పోరాటల తర్వాత ఎట్టకేలకు బెంగాల్​ కమలం పార్టీ విజయం సాధించింది.

Kerala Political Update | త్రిపురలో..

త్రిపురలో సైతం 25 అధికారంలో ఉన్నా.. ఆ పార్టీ ఇప్పుడు నామా రూపాలు లేకుండా పోయింది. 1993 నుంచి 2018 వరకు అక్కడ మాణిక్​ సర్కార్​ సీఎంగా ఉన్నారు. 2018లో త్రిపురను బీజేపీ (BJP) గెలుచుకుంది. అనంతరం 2023 ఎన్నికల్లో సైతం విజయం సాధించింది. దీంతో కేరళంలో మాత్రమే కమ్యూనిస్ట్ పార్టీ కొంత మేర ప్రభావం చూపుతోంది. మొన్నటి వరకు అధికారంలో ఉన్న ఆ పార్టీకి తాజాగా ఓటర్లు షాక్​ ఇచ్చారు. కేరళంలో కాంగ్రెస్​ నేతృత్వంలోని యూడీఎఫ్​కు పట్టం కట్టారు. దీంతో దేశంలో ప్రస్తుతం ఏ రాష్ట్రంలో కూడా కమ్యూనిస్ట్​లు అధికారంలో లేరు. సీపీఐ, సీపీఎంలకు కలిసి ప్రస్తుతం 11 మంది ఎంపీలు ఉన్నారు.

Kerala Political Update | శబరిమల అంశంతో..

కేరళంలో పినరయి విజయన్​ (Pinarayi Vijayan) ప్రభుత్వం హిందూ వ్యతిరేకంగా వ్యవహరించింది. ముఖ్యంగా శబరిమల ఆలయ విషయంలో ఆ పార్టీ తీరుపై రాష్ట్ర ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఆ ఆగ్రహం ఇప్పుడు ఓటు రూపంలో చూపించారు. దీంతో ఎల్​డీఎఫ్​ 40 స్థానాల్లో మాత్రమే ఆధిక్యంలో ఉంది. సీఎం పినరయి విజయన్ సైతం వెనుకంజలో ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Vijay TVK Leads | టీవీకే అధినేత విజయ్​ ఇంట్లో సంబరాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *