Jagadam Naresh CI | శాంతి భద్రతల పరిరక్షణకు కృషి: సీఐ జగడం నరేష్​

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని సీఐ జగడం నరేష్​ అన్నారు. భిక్కనూరు (Bhiknoor) పోలీస్​స్టేషన్​లో సోమవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేసిన సీఐ సంపత్ కుమార్​ను ఐజీ కార్యాలయానికి (IG Office) అటాచ్ చేసిన విషయం తెలిసారు. ప్రస్తుతం ఆయనకు పోస్టింగ్ ఇవ్వలేదు.

Jagadam Naresh CI | పలువురి శుభాకాంక్షలు

బాధ్యతలు చేపట్టిన సీఐ నరేష్​ను (CI Naresh) పలువురు ఎస్సైలు, పోలీసు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. శాంతిభద్రతల విషయంలో ప్రజలతో కలిసి ముందుకు సాగుతామన్నారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కామారెడ్డి (Kamareddy Police) జిల్లాలో జగడం నరేష్​కు పనిచేసిన అనుభవం ఉంది. సదాశివనగర్ (Sadasivanagar) ఎస్సైగా, బిచ్కుంద(Bichkunda) సీఐగా విధులు నిర్వర్తించారు.

ఇది కూడా చదవండి: Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *