అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Accident | అగ్ని ప్రమాదం (Fire Accident)లో దుకాణాలను కోల్పోయిన బాధిత చిరు వ్యాపారులకు అండగా ఉంటానని కామారెడ్డి ఎమ్మెల్యే (Kamareddy MLA) కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. సోమవారం ఆయన పాత బస్టాండ్ ఇందిరా చౌక్ వద్ద అగ్నిప్రమాదంలో కాలిపోయిన దుకాణాలను కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు.
Kamareddy Fire Accident | అధైర్యపడొద్దు..
ప్రమాదం జరిగిన తీరును వ్యాపారస్తులను అడిగి ఎమ్మెల్యే తెలుసుకున్నారు. అధైర్యపడవద్దని, అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల దుకాణాలు కాలిపోవడం దురదృష్టకరమని, వ్యాపారస్థులు వ్యాపార సామాగ్రితో పాటు దుకాణం నిర్మాణం మొత్తం నష్టపోయారన్నారు.
22 దుకాణదారుల వివరాలు పూర్తి సమాచారం తనకు ఇవ్వాలని, వారికి సాధ్యమంత తొందరగా ప్రభుత్వం తరపున ఐరన్ నిర్మాణం చేపట్టడానికి ప్రయత్నం చేస్తానని తెలిపారు. ఆలోపు కాలిపోయిన వస్తువులన్నింటినీ తీసేసి స్థలం చదును చేయాలని సూచించారు. కాలిపోవడం ద్వారా నష్టపోయిన మొత్తంలో ప్రభుత్వం తరుపున రావాల్సిన పరిహారం కోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇది కూడా చదవండి..: Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

