Ration Rice Mafia | రేషన్​ బియ్యం పాలిష్​ చేసి.. కిలో రూ.80కి విక్రయం

రేషన్ బియ్యాన్ని పాలిష్​ చేసి కిలో రూ.80 నుంచి రూ.100కు విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ration Rice Mafia | రాష్ట్రంలో రేషన్​ మాఫియా రెచ్చిపోతుంది. ప్రజల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి.. అనంతరం దానిని పాలిష్​ చేసి అధిక ధరలకు విక్రయిస్తోంది. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో పలు బియ్యం డిపోలపై పౌర సరఫరా శాఖ అధికారులు తనిఖీలు చేశారు.

రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి, ప్రముఖ కంపెనీల బ్రాండ్ పేర్లతో బహిరంగ మార్కెట్‌లో కిలో రూ. 80 నుండి రూ. 100 వరకు విక్రయిస్తున్న మాఫియా గుట్టును అధికారులు రట్టు చేశారు. కార్మాన్‌ఘాట్‌లోని బియ్యం డిపోలపై పౌర సరఫరా, విజిలెన్స్ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పలు దుకాణాల నుండి బియ్యం నమూనాలను సేకరించారు.

Ration Rice Mafia | దుకాణాలు మూసి పరారు

అధికారులు తనిఖీలకు రాగానే.. చాలా మంది దుకాణదారులు తమ దుకాణాలను మూసివేసి అక్కడి నుండి పరారయ్యారు. రేషన్ బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి అమ్ముతున్నారని, సంచిలో ఉండాల్సిన దానికంటే తక్కువ తూకంతో విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. కొన్ని డిపోలు ట్రేడ్ లైసెన్స్ కూడా లేకుండా నడుస్తున్నట్లు తెలిపారు. ఆయా దుకాణాలపై చర్యలు తీసుకుంటామన్నారు.

ఇది కూడా చదవండి..: Hitec City Traffic Loop | ఐటీ కారిడార్‌లో నిరంతర ప్రయాణమే లక్ష్యం.. కేబీఆర్ పార్క్ మోడల్‌లో వన్-వే లూప్ సిస్టమ్‌కు శ్రీకారం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *