Paddy Procurement | ధాన్యం కొనుగోలు కేంద్రానికి వెళ్లే దారిని తవ్వేశారు.. ఆందోళనలో రైతులు..

shashi kiran Mottala

అక్షరటుడే, లింగంపేట: Paddy Procurement | రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకెళ్లే దారిని ఆదివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తవ్వేశారు. లింగంపేట(lingampet) మండలం మాలపాటి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది.

Paddy Procurement | మండలంలోని మాలపాటిలో..

ఈ సందర్భంగా మాలపాటి గ్రామస్థులు మాట్లాడుతూ.. గ్రామ సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రానికి (Paddy Procurement Center) వెళ్లే రోడ్డును ఆదివారం రాత్రి గుర్తుతెలియని దుండగులు తవ్వేశారన్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు లారీలు వెళ్లే అవకాశం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇసుక మాఫియా పనేనని అనుమానం..?

లింగంపేట మండలంలోని పెద్దవాగు నుంచి శెట్​పల్లి సంగారెడ్డికి (Shetpally Sangareddy) చెందిన కొందరు వ్యక్తులు ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని గ్రామస్థులు తెలిపారు. అయితే వారు నేరుగా కాకుండా మాలపాటి గ్రామ రైతుల పొలాల నుంచి ఇసుకను తరలిస్తుండేవారన్నారు. రెండు రోజుల క్రితం శెట్​పల్లి సంగారెడ్డి గ్రామానికి చెందిన మూడు ఇసుక ట్రాక్టర్లను (Sand Tractors) పోలీసులు పట్టుకుని సీజ్​ చేశారని.. దీంతో ఆగ్రహించిన ఇసుక మాఫియా ఈ పనికి ఒడిగట్టిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా గ్రామస్థులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై దీపక్​కుమార్​ దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారని వారు తెలిపారు.

road1

ఇది కూడా చదవండి: West Bengal Election Results | బెంగాల్​లో మెజారిటీ మార్కును దాటిన బీజేపీ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *