నిజామాబాద్Kamareddy Car Accident | పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి పరిస్థితి సీరియస్​

Kamareddy Car Accident | పశువుల కొట్టంలోకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరి పరిస్థితి సీరియస్​

పెళ్లితంతు ముగించుకుని వెళ్తున్న కారు.. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన రామారెడ్డి మండలం ఉప్పల్​వాయిలో చోటుచేసుకుంది.

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Car Accident | పెళ్లితంతు ముగించుకుని వెళ్తున్న కారు.. అదుపుతప్పి పశువుల కొట్టంలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన రామారెడ్డి మండలం (Ramareddy Mandal) ఉప్పల్​వాయి గ్రామంలో సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

Kamareddy Car Accident | ఉప్పల్​వాయి గ్రామంలో..

స్థానికుల కథనం ప్రకారం.. గాంధారికి చెందిన అమ్మాయికి మాచారెడ్డి మండలం (Machareddy Mandal) సోమార్ పేట గ్రామానికి చెందిన అబ్బాయితో సోమార్ పేటలో (Somar Peta) ఆదివారం వివాహం జరిగింది. వివాహ తంతు పూర్తి చేసుకున్న కుటుంబ సభ్యులు ఎనిమిది మంది ఓ కారులో రామారెడ్డి, ఉప్పల్​వాయి మీదుగా ఆదివారం అర్ధరాత్రి తర్వాత గాంధారికి బయలుదేరారు. సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో రామారెడ్డి మండలం ఉప్పల్​వాయి గ్రామం వద్దకు చేరుకోగానే కారు అదుపుతప్పి కొట్టంలోకి దూసుకెళ్లింది.

వేగంగా ఉన్న కారు కొట్టంలో ఉన్న బర్లను బలంగా ఢీకొనడంతో బోల్తాపడింది. ప్రమాదంలో మూడు గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. మరొక గేదెకు తీవ్ర గాయాలయ్యాయి. అలాగే కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే కామారెడ్డి జీజీహెచ్​కు (Kamareddy GGH) తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ప్రమాద ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇది కూడా చదవండి..: TGEJAC Nizamabad | ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం ముందుకురావడం హర్షణీయం: టీజీఈజేఏసీ జిల్లా ఛైర్మన్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Jagadam Naresh CI | బాధ్యతలు చేపట్టిన సీఐ జగడం నరేష్

అక్షరటుడే, కామారెడ్డి: Jagadam Naresh CI | భిక్కనూర్ సీఐగా (Bhikkanoor)...

Vijay TVK Leads | టీవీకే అధినేత విజయ్​ ఇంట్లో సంబరాలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay TVK Leads | తమిళనాడు (Tamil...

Kamareddy Fire Accident | చిరు వ్యాపారులకు అండగా ఉంటా: ఎమ్మెల్యే కేవీఆర్​

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Fire Accident | అగ్ని ప్రమాదం (Fire...

Puducherry Election Results| తట్టంచావడిలో రంగస్వామి గెలుపు.. పుదుచ్చేరిలో కాంగ్రెస్ కోటలు బద్ధలు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:Puducherry Election Results|పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో మొట్టమొదటి ఫలితం అధికార...