Technical Education System | సాంకేతిక విద్యా వ్యవస్థను యథాతథంగా కొనసాగించాలి

రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యను యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ ఇందూరు జిల్లా కన్వీనర్​ అక్షయ్​ డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Technical Education System | రాష్ట్ర ప్రభుత్వం సాంకేతిక విద్యను (Technical Education System) యథాతథంగా కొనసాగించాలని ఏబీవీపీ ఇందూరు (ABVP Telangana) జిల్లా కన్వీనర్​ అక్షయ్​ డిమాండ్​ చేశారు. ఈ మేరకు సంస్థ కార్యాలయంలో సోమవారం మీడియాతో మాట్లాడారు.

Technical Education System | ‘పాలిటెక్నిక్’​ దెబ్బతినే అవకాశం

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న మార్పుల వల్ల పాలిటెక్నిక్ కళాశాలలు దెబ్బతినే అవకాశం ఉందని అక్షయ్​ పేర్కొన్నారు. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు అనేవి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు అందుబాటులో ఉండే ఒక చక్కని నాణ్యమైన విద్యావ్యవస్థ అని అన్నారు. అలాంటి ఈ సాంకేతిక విద్యను ప్రైవేట్ సంస్థల్లో విలీనం చేసి ఇంజినీర్ కావాలనే వారి కలల్ని దూరం చేసి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పాలిటెక్నిక్​ కాలేజీల్లో మెరుగైన మౌలిక వసతులు, ఆధునిక కోర్సులు, సాంకేతిక పరిజ్ఞానం, పరిశ్రమల అనుసంధానం, మెరుగైన ప్లేస్‌మెంట్లు కల్పించాలననారు. దానిని వదిలేసి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో ‘శక్తి’అనే విభాగంలో చేర్చి ఉన్నత విద్యకు లక్షల మంది విద్యార్థులను దూరం చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే.జీవో నం.97 రద్దు చేయాలని డిమాండ్​ చేశారు. ఈ కార్యక్రమంలో అనిల్, చరణ్, నితిన్, ఆదర్శ్ పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Vijay Sai Reddy | మత మార్పిడులను ప్రోత్సహించిన జగన్ : మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *