Nizamabad Roadside Murder | నగరంలో నడిరోడ్డుపై దారుణ హత్య..

నిజామాబాద్​ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Roadside Murder | నగరంలో (Nizamabad) దారుణ ఘటన చోటు చేసుకుంది. రాజారాజేంద్ర చౌరస్తా  (Rajarajendra Chowk) వద్ద మల్టీఫ్లెక్స్​ థియేటర్​ సమీపంలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

Nizamabad Roadside Murder | కొబ్బరికాయలు కోసే కత్తితో..

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు థియేటర్​ సమీపంలో కూరగాయలు అమ్మే ప్రాంతానికి వచ్చారు. అక్కడ హరిబాబు అనే వ్యక్తిని తమతో తెచ్చుకున్న కొబ్బరికాయలు కోసే కత్తితో నరికారు. దీంతో ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న రెండో టౌన్​ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్​ మార్చురికి తరలించారు. ఏసీపీ ప్రకాశ్​ సంఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు.

Nizamabad Roadside Murder | యూట్యూబర్​ వైష్ణవి హత్య కేసులో నిందితుడు..?

హత్య గురైన హరిబాబు ప్రముఖ యూట్యూబర్​ వైష్ణవి హ్యతలో నిందితుడిగా భావిస్తున్నారు. ఈ కక్షతోనే  హరిబాబును హత్య చేసినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ చేస్తున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.

fkj 1 govt 3

 

ఇది కూడా చదవండి: Kavitha CBI Probe | అఫిడవిట్ కంటే ఒక్క గజం భూమి ఎక్కువ ఉన్నా ప్రభుత్వానికి రాసిస్తా: సీఎం రేవంత్‌కు కవిత సవాల్ 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *