Seethakka Nizamabad Tour | మంత్రి సీతక్క పర్యటన ఏర్పాట్ల పరిశీలన

Shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Seethakka Nizamabad Tour | రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్​ఛార్జి మంత్రి సీతక్క బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ ఇలా త్రిపాఠి (Collector Ila Tripathi) మంగళవారం పరిశీలించారు.

Seethakka Nizamabad Tour | జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో..

జిల్లా కేంద్రంలోని రాజీవ్ గాంధీ ఆడిటోరియం (Rajiv Gandhi Auditorium)లో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో ఇన్​ఛార్జి మంత్రి పాల్గొననుండగా, కలెక్టర్ ఆడిటోరియంను సందర్శించారు. ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, అధికారులకు సూచనలు చేశారు. ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ వెంట ఇన్​ఛార్జి అదనపు కలెక్టర్ దిలీప్ కుమార్, డీఆర్డీఏ సాయన్న, ఆర్డీవో రాజేంద్ర కుమార్, డీడబ్ల్యూవో పద్మ తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Mla Madan Mohan | లింగంపల్లి ఖుర్దు, అడ్విలింగాల వంతెనలకు నిధులు మంజూరు: ఎమ్మెల్యే మదన్​మోహన్​

1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *