BSc Agriculture Jobs | బీఎస్సీ అగ్రికల్చర్​, డిప్లొమా అభ్యర్థుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం..

కామారెడ్డి జిల్లాలోని ప్యాడీసెంటర్లలో సన్నరకం ధాన్యాన్ని గుర్తించి ధృవీకరించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: BSc Agriculture Jobs | జిల్లాలోని(Kamareddy) ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యాన్ని గుర్తించి ధృవీకరించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​ తెలిపారు. ఖరీఫ్ 2026-27 ధాన్యం కొనుగోలు సీజన్ సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

BSc Agriculture Jobs | బీఎస్సీ అగ్రికల్చర్​ లేదా డిప్లొమా..

బీఎస్సీ అగ్రికల్చర్ లేదా అగ్రికల్చర్​లో డిప్లొమా అర్హత కలిగిన వ్యక్తుల సేవలు 2 నెలల కాలానికి అవసరమున్నాయని కలెక్టర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య, అర్హతను పరిగణనలోకి తీసుకుని అర్హత కలిగిన వ్యక్తుల సేవల కోసం జిల్లాస్థాయి కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థులు తమ విద్యార్హతలు, అనుభవ వివరాలతో కామారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.

ఇది కూడా చదవండి: స్టాక్ మార్కెట్‌లో బ్లడ్ బాత్..రూ.10 లక్షల కోట్ల సంపద ఆవిరి..! 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *