అక్షరటుడే వెబ్‌డెస్క్: HCLTech Industry AI | గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజమైన హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ (HCLTech) కృత్రిమ మేధస్సు (AI) రంగంలో మరో మైలురాయిని తాకింది. వివిధ రంగాల వ్యాపార సంస్థలు ఎదుర్కొంటున్న సంక్లిష్ట సమస్యలను పరిష్కరించేందుకు, ఉత్పాదకతను భారీగా పెంచేందుకు వీలుగా ఏకంగా 20 ప్రత్యేకమైన ‘ఇండస్ట్రీ ఏఐ సొల్యూషన్స్’ (IAIS)ను తాజాగా ఆవిష్కరించింది. బ్యాంకింగ్, హెల్త్‌కేర్, రిటైల్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి ప్రముఖ సెక్టార్లను టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన ఈ అత్యాధునిక టెక్నాలజీ ప్రస్తుతం వ్యాపార వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
HCLTech Industry AI | సరికొత్త ప్రయాణం..
అడ్వాన్స్‌డ్ ఏఐ టెక్నాలజీలో తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే వ్యూహాంలో భాగంగా హెచ్‌సీఎల్ టెక్ ఈ 20 పర్పస్-బిల్ట్ ఇండస్ట్రీ ఏఐ సొల్యూషన్స్‌ను రూపొందించింది. బ్యాంకింగ్, ఏరోస్పేస్, రిటైల్, టెలికాం, ఎనర్జీ వంటి పలు రంగాల్లోని హై-వాల్యూ సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ఇవి పనిచేస్తాయి. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు క్లయింట్ ఆపరేషన్లలో ఇవి పెద్ద ఎంటర్‌ప్రైజ్ స్థాయిలో అమలవుతుండగా, మరికొన్ని తొలి దశ అమలులో ఉన్నాయి.
HCLTech Industry AI | ఏఐ టెక్నాలజీ..
వ్యాపార విలువలను మార్చడంలో ఏఐకి అపారమైన శక్తి ఉందని, అయితే దానికి లోతైన రంగాల వారగా స్పష్టత (Domain Specificity) అవసరమని హెచ్‌సీఎల్ టెక్ ‘ఇండస్ట్రీ ఏఐ సొల్యూషన్స్’ గ్లోబల్ హెడ్ డాక్టర్ గౌరవ్ ధాకర్ తెలిపారు. తమ ఏఐ సొల్యూషన్స్ ఈ అంతరాన్ని పూడ్చి, వ్యాపార సంస్థలు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా వేగంగా ముందుకు వెళ్లేలా సహకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.
తయారీ , లాజిస్టిక్స్ రంగాల కోసం హెచ్‌సీఎల్ టెక్ తీసుకువచ్చిన ‘విజన్‌ఎక్స్’ (VisionX) అనే కంప్యూటర్ విజన్ ఏఐ ప్లాట్‌ఫారమ్ అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. ఫ్యాక్టరీలు, వేర్‌హౌస్‌లలో స్పందన వేగాన్ని ఇది 90 శాతానికి పైగా పెంచగా, నిర్వహణ ఖర్చులను ఏకంగా 70 శాతం వరకు తగ్గించింది. అలాగే ‘స్మార్ట్‌ట్విన్’ (SmartTwin) టెక్నాలజీ ద్వారా తయారీదారులు కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చే ముందు వర్చువల్‌గా పరీక్షించుకోవచ్చు. దీనివల్ల కొత్త ఉత్పత్తులు మార్కెట్లోకి వచ్చే సమయం 44 శాతం వరకు వేగవంతమవుతుంది.
HCLTech Industry AI | ఫైనాన్స్ సేవల్లోనూ..
లైఫ్ సైన్సెస్ , హెల్త్‌కేర్ సెక్టార్‌లో హెచ్‌సీఎల్ టెక్‌కి చెందిన ‘ఇంటెలిజెంట్ సేఫ్టీ ప్లాట్‌ఫారమ్’ సేఫ్టీ కేసుల ప్రాసెసింగ్ సమయాన్ని ఏకంగా 40 నుంచి 50 శాతం వరకు తగ్గించింది. మరోవైపు, ఫైనాన్స్ ఆపరేషన్ల కోసం రూపొందించిన ‘అటానమస్ అకౌంట్స్ పేయబుల్’ అనే ఏఐ ఇన్వాయిస్ మేనేజ్‌మెంట్ ప్లాట్‌ఫారమ్.. ఒక ప్రముఖ గ్లోబల్ బైక్స్ తయారీ సంస్థలో విజయవంతంగా అమలవుతోంది. దీని ద్వారా ఇన్వాయిస్ ప్రాసెసింగ్ సమయం 60 శాతం వరకు తగ్గిపోయింది. వ్యాపార సంస్థలు కేవలం ఏఐ ప్రయోగాలు చేయకుండా, నిజ జీవితంలో మెరుగైన ఉత్పాదకత, సామర్థ్యం , వృద్ధిని సాధించేలా ఈ సొల్యూషన్స్ ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో తమ ‘ఇండస్ట్రీ ఏఐ సొల్యూషన్స్’ పోర్ట్‌ఫోలియోను మరింత విస్తరించాలని హెచ్‌సీఎల్ టెక్ ప్రణాళికలు రచిస్తోంది.
ఇది కూడా చదవండి: New Bar Applications | నూతన బార్ ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం