అక్షరటుడే వెబ్‌డెస్క్: EPFO PF Portal | ఉద్యోగాలు మారినప్పుడు పాత పీఎఫ్ (PF) ఖాతాల వివరాలు లేదా మెంబర్ ఐడీలు మర్చిపోయిన ఉద్యోగులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇలాంటి వారి కోసం ఈపీఎఫ్‌ఓ ప్రత్యేకంగా ఒక కొత్త ఆధార్ ( Aadhaar )ఆధారిత డిజిటల్ పోర్టల్‌ను తీసుకొచ్చింది. పార్లమెంట్ వేదికగా కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది.
EPFO PF Portal | నిధుల బదిలీ ఇక సులభం..
గతంలో ఉద్యోగాలు మారే సమయంలో పాత కంపెనీల మెంబర్ ఐడీలను సరిగ్గా నమోదు చేయకపోవడం లేదా UAN నంబర్‌కు లింక్ చేయకపోవడం వల్ల చాలామంది పీఎఫ్ ఖాతాల్లో డబ్బులు నిలిచిపోయాయి (Inoperative Accounts). ఈ సమస్యకు చెక్ పెట్టేందుకే ఈ కొత్త పోర్టల్‌ను రూపొందించారు.
EPFO PF Portal | UAN ఖాతాలోకి బదిలీ ..
ఇకపై ఉద్యోగులు పీఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పనిలేదు. అత్యంత సురక్షితమైన ఆధార్ ఆథెంటికేషన్ ద్వారా మర్చిపోయిన పాత పీఎఫ్ ఖాతాలను సులభంగా ట్రాక్ చేయవచ్చు. వేర్వేరు ఖాతాల్లో ఆగిపోయిన పీఎఫ్ బ్యాలెన్స్‌ను గుర్తించి, ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న UAN ఖాతాలోకి ఉచితంగా బదిలీ చేసుకోవచ్చు. అంతేకాకుండా, పాత ఖాతాలోని డబ్బును నేరుగా విత్‌డ్రా చేసుకునేందుకు కూడా ఈ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.
EPFO PF Portal |త్వరలోనే అధికారిక ప్రకటన..
ఈ డిజిటల్ పోర్టల్‌ను ఈపీఎఫ్‌ఓ ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసింది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్ లింక్ , ప్రారంభ తేదీ వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Cellulitis Symptoms | చిన్న గాయాన్నైనా నిర్లక్ష్యం చేస్తే ‘సెల్యులైటిస్’గా మారవచ్చు