Kamareddy Murder Case | ఆస్తి తగాదాలతో అన్న హత్య.. తండ్రీకొడుకులకు జీవిత ఖైదు

కుమారుడితో కలిసి తన సొంతను హత్య చేశాడో వ్యక్తి. ఈ కేసులో తండ్రీకొడుకులకు కోర్టు జీవిత ఖైదు విధించింది.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Murder Case | పాత కక్షలు ఆస్తితగాదాలతో అన్నను తమ్ముడితో పాటు అతడి కుమారుడు కలిసి హత్య చేశారు. ఈ ఘటనలో తండ్రీకొడుకులకు కామారెడ్డి (Kamareddy) జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది.

Kamareddy Murder Case | బీర్కూర్​ మండలం బరంగేడ్గిలో..

బీర్కూర్(Birkur) మండలం బరంగేడ్గి గ్రామానికి చెందిన వడ్ల మారుతి 2018 సెప్టెంబర్ 2న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు వడ్ల రాజ్‌కుమార్ బీర్కూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం వడ్ల మారుతి, నిందితుడు వడ్ల సాయిలు స్వయానా అన్నదమ్ములు. కుటుంబ పెద్దలు ఆస్తి పంపకాల సమయంలో మారుతి పేరిట 3 ఎకరాలు, సాయిలు పేరిట 2 ఎకరాలు పట్టా చేశారు. అయితే ఇంకా అర ఎకరం రావాల్సి ఉండడంతో ఇరువురి మధ్య సుమారు 10 ఏళ్లుగా విభేదాలు ఉన్నాయి. ఈ విషయంలో గతంలో సాయిలు తన అన్నపై కేసు కూడా పెట్టాడు. తర్వాత కోర్టులో రాజీ కుదిరి, అర ఎకరం ఇస్తానని మారుతి హామీ ఇవ్వడంతో కేసును ఉపసంహరించుకున్నారు.

Kamareddy Murder Case | వండ్రంగి పనిముట్టుతో కొట్టి..

కానీ మాట తప్పడంతో కక్షలు కొనసాగాయి. ఘటన రోజున సాయిలు మృదంగం రిపేరు చేయించాలనే సాకుతో అన్న మారుతిని ఇంటికి పిలిపించాడు. అక్కడ తన కుమారుడు వడ్ల గజానంద్‌తో కలిసి వడ్రంగి బాడిషతో మారుతి తలపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన మారుతిని 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, వైద్యులు అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. ఈ కేసులో విచారణ చేపట్టిన పోలీసులు సాక్షుల వాంగ్మూలాలు రికార్డు చేయడంతో పాటు ఆధారాలు సేకరించి, వడ్ల గజానంద్, వడ్ల సాయిలుపై కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. కేసును విచారించిన జిల్లా న్యాయమూర్తి పి. ముక్తిద సాక్ష్యాలను పరిశీలించి ఇద్దరు నిందితులకు జీవిత ఖైదుతో పాటు రూ.2 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు.

ఇది కూడా చదవండి: AP: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అర్ధరాత్రి సమయంలో కురిసిన భారీ వర్షానికి ప్రత్యక్షమైన పసుపు రంగు కప్పలు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *