నిజామాబాద్Deeksha Success Story | ఒత్తిడి లేని చదువు.. పక్కా ప్రణాళికే నా విజయ రహస్యం:...

Deeksha Success Story | ఒత్తిడి లేని చదువు.. పక్కా ప్రణాళికే నా విజయ రహస్యం: ఎస్సెస్సీ జిల్లా సెకండ్​ టాపర్​ దీక్ష

ఇటీవల వెలువడిన ఎస్సెస్సీ ఫలితాల్లో జిల్లాకు చెందిన దీక్ష సత్తా చాటింది. ఆమె సాధించిన విజయం ప్రణాళిక, క్రమశిక్షణ, ఒత్తిడి లేని చదువు ఎంత ముఖ్యమో తెలియజేస్తోంది.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Deeksha Success Story | నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన విద్యార్థిని కుంట దీక్ష తన ప్రతిభతో పదో తరగతి ఫలితాల్లో మెరిసి అందరికీ ప్రేరణగా నిలిచింది. 600 మార్కులకు గాను 588 మార్కులు సాధించి జిల్లాలోనే రెండో స్థానం దక్కించుకోవడం ద్వారా తన కృషి, పట్టుదల ఏ స్థాయిలో ఉందో నిరూపించింది.

నగరంలోని కుంట సంజీవ్​–రాధిక (Kunta Sanjeev -Radhika) దంపతుల కూతురు కుంట దీక్ష. సుభాష్​నగర్​లోని హైదరాబాద్​ పబ్లిక్​ స్కూల్ (HPS)​లో చదివిన ఈ విద్యార్థిని తాను సాధించిన ఈ స్థాయి మార్కులు, చూపిన ప్రతిభపై అక్షరటుడేతో పంచుకున్న మనోగతాలు, అనుభవాలు, సూచనలు ఇతర విద్యార్థులకు మార్గదర్శకంగా నిలుస్తాయి.

Deeksha Success Story | పక్కా ప్లాన్​ ప్రకారం..

“నేను ఈ స్థాయి మార్కులు సాధించడానికి ప్రధాన కారణం సరైన ప్రణాళిక. మొదటి నుంచే ఏం చదవాలి..? ఎలా చదవాలి..? అనే దానిపై స్పష్టమైన ప్రణాళిక వేసుకున్నాను. చివరి సమయంలో ఒత్తిడికి లోనవకుండా, ప్రతిరోజు కొద్దికొద్దిగా చదవడం అలవాటు చేసుకున్నాను. దీనివల్ల పరీక్షల సమయంలో భయం లేకుండా ప్రశాంతంగా రాయగలిగాను..” అని దీక్ష తెలిపింది.

చదువులో ఒత్తిడి లేకపోవడం కూడా కీలకమని ఆమె పేర్కొంది. “మార్కుల కోసం నా తల్లిదండ్రులు ఎప్పుడూ నన్ను ఒత్తిడి చేయలేదు. నాపై నమ్మకం ఉంచారు. అదే నాకు ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది..” అని వివరించింది.

Deeksha Success Story | మొబైల్, సోషల్ మీడియాకు దూరం

విద్యార్థులకు దీక్ష ఇచ్చిన సూచనలు ఎంతో విలువైనవి.. “పరీక్షల ముందు ఒక్కసారిగా ఎక్కువ చదవడం కంటే, రోజూ కొద్దిగా చదవడం చాలా మంచిది. ముఖ్యంగా అర్థం చేసుకుంటూ చదవడం ఎంతో ముఖ్యం. టైమ్ టేబుల్ వేసుకుని దాన్ని క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చు. అయితే మొబైల్, సోషల్ మీడియాకు దూరంగా ఉండటం చాలా అవసరం..” అని స్పష్టం చేసింది.

మానసిక ప్రశాంతత కూడా ముఖ్యమని దీక్ష చెబుతోంది. “ఒత్తిడి వచ్చినప్పుడు చిన్న విరామం తీసుకోవాలి. కుటుంబ సభ్యులతో మాట్లాడటం, కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవడం వల్ల చదువుపై ఫోకస్ పెరుగుతుంది..” అని వివరించింది.

ఇది కూడా చదవండి: Telangana Cabinet Decisions | భూముల ధరల పెంపు.. ఈ నెలాఖరు నుంచే అమలు!

 

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Self Enumeration Record | స్వీయ గణనలో రికార్డు.. సోమ్లా నాయక్ తండా ఘనత

అక్షరటుడే, బాన్సువాడ : Self Enumeration Record | బాన్సువాడ మండలం...

Census Self Enumeration | నాగిరెడ్డిపేట మండలంలో జనాభా లెక్కల స్వీయ గణనకు శ్రీకారం

అక్షరటుడే, ఎల్లారెడ్డి : Census Self Enumeration | జనాభా లెక్కల...

Mamata Banerjee Statement| రాజ్‌భవన్‌కు వెళ్లేది లేదు.. రాజీనామా చేసేది లేదు: మమతా బెనర్జీ

అక్షరటుడే వెబ్‌డెస్క్:Mamata Banerjee Statement| పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన...

BRS Councillor Resignation | బీఆర్​ఎస్​కు​ కౌన్సిలర్ రాజీనామా.. కాంగ్రెస్​లో చేరిక

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BRS Councillor Resignation | ఎల్లారెడ్డి మున్సిపల్ 11వ...