Air India Turbulence | ఎయిరిండియా విమానంలో భారీ కుదుపులు.. పలువురికి గాయాలు

పుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Air India Turbulence | పుకెట్ నుంచి దిల్లీ వస్తున్న ఎయిరిండియా విమానానికి త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. గాల్లో ప్రయాణిస్తుండగా విమానం అకస్మాత్తుగా తీవ్ర కుదుపులకు లోనైంది. గమ్యస్థానానికి కొద్ది నిమిషాల దూరంలో ఉండగా భారీ గాలుల కారణంగా విమానం ఒక్కసారిగా సుమారు 300 అడుగుల మేర కిందకు పడిపోయింది. ఈ ఊహించని పరిణామంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది గాయపడ్డారు.

Air India Turbulence | పైలట్ అప్రమత్తత..

ఇలాంటి సంక్షిష్ట సమయంలోనూ పైలట్ అత్యంత అప్రమత్తంగా వ్యవహరించి, విమానాన్ని దిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విమానం నేల దిగగానే అప్పటికే సిద్ధంగా ఉన్న వైద్య బృందాలు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించి వైద్యం అందించాయి.

Air India Turbulence | ఎయిరిండియా , డీజీసీఏ స్పందన..

ప్రయాణికులందరూ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, గాయపడిన వారికి తగిన చికిత్స అందిస్తున్నామని ఎయిరిండియా అధికారికంగా వెల్లడించింది. అలాగే, ఈ భద్రతా ఘటనపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) చేపట్టిన పూర్తి స్థాయి దర్యాప్తునకు తాము సంపూర్ణంగా సహకరిస్తున్నట్లు సంస్థ తెలిపింది.

ఇది కూడా చదవండి:  Udhayanidhi Stalin Bail | ఉదయనిధి స్టాలిన్‌కు ఊరట.. స్టేషన్‌ బెయిల్‌ మంజూరు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *