అక్షరటుడే, వెబ్‌డెస్క్: Rythu Discom Telangana | తెలంగాణ రాష్ట్రంలో సాగు రంగానికి మరింత నాణ్యమైన, నమ్మకమైన సేవలు అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ‘రైతు డిస్కం’ (TGRPDCL) ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. జూన్ 2న తెలంగాణ(Telangana) ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నూతన డిస్కం పూర్తిస్థాయి సిబ్బందితో తన అధికారిక కార్యకలాపాలను ప్రారంభించనుంది. ఈ సరికొత్త సంస్థకు సీఎండీగా ముషారఫ్ ఫరూఖీ బాధ్యతలు చేపట్టనున్నారు.
Rythu Discom Telangana | ఆకట్టుకుంటున్నలోగో..
ఈ నూతన డిస్కానికి సంబంధించిన అధికారిక లోగోను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. పచ్చని పంటసాగు దృశ్యం బ్యాక్‌గ్రౌండ్‌గా ఉన్న ఈ లోగోలో… భవిష్యత్తు ఇంధన వనరులైన సౌర (సోలార్), జల (హైడ్రో), పవన (విండ్) విద్యుత్ చిహ్నాలను ప్రత్యేకంగా పొందుపరిచారు. ఇది రైతులకు పర్యావరణహిత, నిరంతర విద్యుత్ సరఫరాను ప్రతిబింబించేలా ఉంది.

Rythu Discom Telangana | 42 శాతం విద్యుత్ వాటా..
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కంల) పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లు, ట్రాన్స్ఫార్మర్లను పూర్తిగా వేరు చేస్తూ ఈ ప్రత్యేక డిస్కంను రూపుదిద్దారు. గత ఐదేళ్ల కాలంలో జరిగిన విద్యుత్ వినియోగ గణాంకాలను పరిశీలించిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పాటైన రైతు డిస్కానికే అత్యధికంగా 42 శాతం విద్యుత్ వాటాను కేటాయించడం విశేషం.

Rythu Discom Telangana | యాప్ ద్వారా డిజిటల్ సర్వే ముమ్మరం..
క్షేత్రస్థాయిలో పనులను వేగవంతం చేసేందుకు రైతు డిస్కం సాంకేతికతను జోడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ల ఖచ్చితమైన వివరాలు, వాటి లొకేషన్లను డిజిటల్ రూపంలో సేకరించేందుకు ఒక ప్రత్యేక మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్ ఆధారంగా అధికారులు ప్రస్తుతం క్షేత్రస్థాయి సర్వేను మరింత ముమ్మరం చేశారు.
ఇది కూడా చదవండి: Forest Officer Death | ప్రాణం తీసిన ఈత సరదా.. స్విమ్మింగ్‌పూల్‌లో మునిగి ఫారెస్ట్ అధికారి మృతి


