జాతీయంHighway Privatization India | హైవేల నిర్వహణ ప్రైవేట్​కు.. కేంద్రం కీలక నిర్ణయం

Highway Privatization India | హైవేల నిర్వహణ ప్రైవేట్​కు.. కేంద్రం కీలక నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం పలు జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనుంది. ఈ మేరకు ఎన్​హెచ్​ఏఐ నిర్ణయం తీసుకుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Highway Privatization India | కేంద్ర ప్రభుత్వం (Central Government) పలు జాతీయ రహదారుల నిర్వహణ బాధ్యతను ప్రైవేట్ సంస్థలకు అప్పగించనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తెలంగాణలోని యాదాద్రి–వరంగల్ హైవే ప్రైవేటుకు అప్పగించనున్నట్లు సమాచారం.

దేశంలోని 17 జాతీయ రహదారులను 2026–27 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేటుకు కట్టబెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది. ఇందులో భాగంగా తెలంగాణలో NH–163 పరిధిలోని యాదాద్రి–వరంగల్ సెక్షన్‌లోని 99.1 కిలోమీటర్ల రహదారిని, కోమళ్ల, కోమటిపల్లి టోల్ ప్లాజాలను ప్రైవేటు సంస్థకు అప్పగించనుంది. హరియాణ, జార్ఖండ్ రాష్ట్రాల నుండి 3, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు నుండి 2, కర్ణాటక, బీహార్ రాష్ట్రాల నుండి ఒక్కో హైవేను ప్రవేటుకు అప్పగించేందుకు యత్నిస్తున్నట్లు సమచారం.

Highway Privatization India | ఎన్​హెచ్​ఏఐ ఆధ్వర్యంలో..

ప్రస్తుతం జాతీయ రహదారి నిర్వహణ బాధ్యతను ఎన్​హెచ్​ఏఐ చూసుకుంటుంది. టోల్​ వసూల్ (Toll Collection)​తో పాటు రోడ్లకు మరమ్మతులు, నిర్వహణ పనులు చేపడుతోంది. అయితే ఇక నుంచి కొన్ని హైవేల బాధ్యతలను ప్రైవేట్​ సంస్థలు చూసుకోనున్నాయి. ప్రస్తుతం వాడుకలో ఉన్న జాతీయ రహదారి ఆస్తుల నుండి విలువను రాబట్టేందుకు, 2026-27 ఆర్థిక సంవత్సరంలో టోల్-ఆపరేట్-ట్రాన్స్‌ఫర్ (TOT), ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ (InvIT) పద్ధతుల కింద నగదీకరణ కోసం ప్రతిపాదించిన జాతీయ రహదారి (National Highway) మార్గాల తాత్కాలిక జాబితాను NHAI ఖరారు చేసింది.

Highway Privatization India | అభివృద్ధి కోసం

మరింత మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం మూలధనాన్ని సమీకరించడానికి, ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడానికి, మరియు జాతీయ రహదారి నెట్‌వర్క్ యొక్క విస్తరణతో పాటు ఆధునీకరణను వేగవంతం చేయడానికి కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. గుర్తించబడిన జాతీయ రహదారుల ఆస్తులు, మొత్తం 1692.5 కిలోమీటర్ల పొడవుతో, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్, బీహార్, మహారాష్ట్రలతో సహా తొమ్మిది రాష్ట్రాలలో విస్తరించి ఉన్నాయి. ఈ రహదారి ఆస్తులు సమిష్టిగా, స్థిరమైన ట్రాఫిక్ సామర్థ్యం మరియు పటిష్టమైన కనెక్టివిటీ ప్రాముఖ్యత కలిగిన ఆర్థిక మరియు లాజిస్టిక్స్ కారిడార్లను సూచిస్తాయి.

ఇది కూడా చదవండి..: Mukesh Ambani Salary | ఆరేళ్లుగా వేతనమే లేదు.. అయినా ప్రపంచ కుబేరుల్లో 21వ స్థానం..

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న...

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...