Shashi Tharoor | దురంధర్​ మూవీపై శశిథరూర్​ కీలక వ్యాఖ్యలు

దురంధర్​ మూవీపై కాంగ్రెస్​ ఎంపీ శశి థరూర్​ కీలక వ్యాఖ్యలు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Shashi Tharoor | రణవీర్ సింగ్ నటించిన ‘ధురందర్’ సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వచ్చిన ఈ మూవీ భారీగా కలెక్షన్లు సాధించింది. తాజాగా ఈ సినిమాపై కాంగ్రెస్​ ఎంపీ శశిథరూర్ (MP Shashi Tharoor) కీలక వ్యాఖ్యలు చేశారు.

మూవీ రెండు పార్టులను చూసిన అనంతరం శశిథరూర్​ వీడియో ద్వారా తన సమీక్షను పంచుకున్నారు. చిత్రనిర్మాణం, నటన, స్థాయిని ప్రశంసిస్తూనే, దానిలోని గ్రాఫిక్ హింస, రాజకీయ సందేశాన్ని ప్రశ్నించారు. మొదటి భాగం కంటే రెండవ భాగం ‘ధురందర్: ది రివెంజ్’ తనకు ఎక్కువగా నచ్చిందన్నారు. అయితే అందులోని హింస చాలాసార్లు హద్దులు దాటిందని చెప్పారు. ఇంత హింస, విధ్వంసం, క్రూరత్వం, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత అసహ్యకరమైన కొన్ని దృశ్యాలను చూపించాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయ పడ్డారు.

Shashi Tharoor | భారత్–పాక్​ సంబంధాలపై..

భారత్-పాకిస్తాన్ సంబంధాలపై మూవీలో చూపించిన విధానంపై శశిథరూర్​ పలు ప్రశ్నలు వేశారు. ఇందులో చాలా ప్రచార అంశాలు పొందుపరిచారన్నారు. ఈ చిత్రం కేవలం పాకిస్థాన్‌లోనే కాకుండా, అనేక గల్ఫ్ దేశాలలో కూడా నిషేధించినట్లు గుర్తు చేశారు. హీరో రణ్​వీర్​ పాత్రపై సైతం ఆయన స్పందించారు. గూఢచారి అధికారులతో తనకు ఉన్న అనుభవాలకు, ఈ చిత్రంలో చూపించిన ప్రపంచానికి చాలా తేడా ఉందన్నారు. మన నిఘా సంస్థల అధికారులు నాగరికమైన పద్ధతిలో, విశ్లేషణలు, సంభాషణలు, సమాచార మార్పిడితో పనులు చేస్తారన్నారు. ఎటువంటి రహస్య కుట్రలు లేదా ప్రమాదకరమైన కార్యకలాపాలు ఉండవని చెప్పారు. కొన్ని అభ్యంతరాలు ఉన్నా.. ఈ సినిమాలను బాగా తీశారని కాంగ్రెస్​ ఎంపీ అభినందించారు. మొత్తం 8 గంటల నిడివి గల ఈ చిత్రాన్ని చూశాక, ఒక గొప్ప సినిమాటిక్ అనుభూతిని పొందినట్లు అనిపిస్తుందన్నారు.

ఇది కూడా చదవండి..: Tiger Shroff | టైగర్​ ష్రాఫ్​పై హత్యాయత్నం.. గన్స్​ అందించిన మహిళలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *