అక్షరటుడే, వెబ్డెస్క్: Bihar Boat Accident | బీహార్లోని వైశాలి జిల్లాలో గంగా నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 13 మంది ప్రాణాలు కోల్పోయారు.
వైశాలిలోని రాఘోపూర్ ప్రాంతంలో పడవ బోల్తా పడింది. ఆ సమయంలో అందులో సుమారు 20 మంది ప్రయాణిస్తున్నారు. మరణించిన వారు అందరు 15 ఏళ్లలోపు పిల్లలే కావడం గమనార్హం. ఈ ఘటన మంగళవారం సాయంత్రం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే అధికారుల బృందాన్ని ఘటనా స్థలానికి పంపారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. రాత్రి వరకు శ్రమించి మృతదేహాలను వెలికితీశారు.
Bihar Boat Accident | విందుకు వెళ్తుండగా..
గంగా నదిలో 15 ఏళ్లలోపు వయస్సు గల సుమారు 20 మంది పిల్లలతో కిక్కిరిసి ఉన్న పడవ బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ఆ పిల్లలు పొరుగు గ్రామంలో జరిగే విందుకు హాజరయ్యేందుకు ప్రయాణిస్తున్నారు. 13 మంది పిల్లల మృతదేహాలకు బుధవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన సంతాపం వ్యక్తం చేశారు. నదిలో గల్లంతైన వారి కోసం ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాధిత కుటుంబాలకు ప్రధాని మోదీ (Prime Minister Modi) సంతాపం తెలిపారు. రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు.
ఇది కూడా చదవండి..: Cockroach Janata Party Protest | జెండా పట్టుకున్నందుకు జైలుకా?.. కేంద్రం తీరుపై అభిజిత్ దీప్కే తీవ్ర ఆగ్రహం