అక్షరటుడే, న్యూఢిల్లీ: India New Zealand FTA | భారత్ , న్యూజిలాండ్ దేశాల మధ్య దశాబ్ద కాలంగా ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (Free Trade Agreement) పట్టాలెక్కింది. న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్ ఈ డీల్‌ను “వన్స్ ఇన్ ఏ జనరేషన్” (ఒక తరంలో ఒక్కసారి వచ్చేది) ఒప్పందంగా అభివర్ణించారు. 140 కోట్ల జనాభా ఉన్న భారత మార్కెట్లోకి తమ ఎగుమతిదారులకు అద్భుతమైన ప్రవేశం దొరికిందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
India New Zealand FTA | ఒప్పందంలోని అంశాలు:
భారత ఎగుమతులకు ఊతం: భారత్ నుంచి ఎగుమతి అయ్యే దాదాపు 8,284 రకాల వస్తువులపై ఇక నుంచి న్యూజిలాండ్ ఎలాంటి సుంకాలను (Zero Tariffs) వసూలు చేయదు. ముఖ్యంగా టెక్స్టైల్స్, ఫార్మా, లెదర్, ఇంజనీరింగ్ వస్తువులు , వ్యవసాయ ఉత్పత్తులకు ఇది పెద్ద వరం.
భారత్ రాయితీలు: న్యూజిలాండ్ నుంచి వచ్చే సుమారు 70% దిగుమతులపై భారత్ టారిఫ్స్‌ను తొలగించనుంది. అయితే మన దేశీయ పాడి పరిశ్రమ (Dairy Sector) , రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు పాల ఉత్పత్తులు, ఉల్లిగడ్డలు, చక్కెర వంటి వాటిని ఈ ఒప్పందం నుంచి మినహాయించింది.
భారీ పెట్టుబడులు: ఈ డీల్‌లో భాగంగా వచ్చే 15 ఏళ్లలో న్యూజిలాండ్ భారత్‌లో 20 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 1.66 లక్షల కోట్లు) పెట్టుబడులు పెట్టనుంది. ఇది మన దేశంలో మౌలిక సదుపాయాలు, తయారీ రంగానికి ఊతమివ్వనుంది.
ఉద్యోగ అవకాశాలు: భారతీయ నిపుణుల కోసం ఏటా 5,000 తాత్కాలిక ఉపాధి వీసాలను న్యూజిలాండ్ కేటాయించింది. ఐటీ, హెల్త్‌కేర్, విద్య వంటి రంగాల్లోని వారికి ఇది మంచి అవకాశం.
ఇది కూడా చదవండి..: Live-in Relationship | లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌పై సుప్రీం కీలక వ్యాఖ్యలు


[…] […]