బిజినెస్​Stock Market Rally | మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

Stock Market Rally | మూడు రోజుల నష్టాలకు బ్రేక్.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ 3 సెషన్ల తర్వాత లాభాల బాట పట్టింది. సెన్సెక్స్ 639 పాయింట్లు, నిఫ్టీ 194 పాయింట్లు లాభపడ్డాయి.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Stock Market Rally | పశ్చిమాసియాలో అనిశ్చిత పరిస్థితులు కొనసాగుతున్నా.. అమెరికా, ఇరాన్‌ల మధ్య శాంతి చర్చల విషయంలో ముందడుగు పడవచ్చన్న అంచనాలతో స్టాక్ మార్కెట్ (Stock Market) కోలుకుంది.

కనిష్టాల వద్ద ఇన్వెస్టర్లు వాల్యూ బయ్యింగ్‌కు మొగ్గు చూపడంతో మÖడు రోజుల నష్టాల పరంపరకు బ్రేక్ పడింది. హెవీ వెయిట్ స్టాక్ అయిన రిలయన్స్‌తోపాటు ఐటీ, ఆటో, బ్యాంకింగ్ స్టాక్స్ రాణించడంతో బెంచ్ మార్క్ సూచీలు పరుగులు తీశాయి.

Stock Market Rally | గ్యాప్ అప్ లో ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic Stock Market) సోమవారం గ్యాప్ అప్ లో ప్రారంభమైంది. ఉదయం సెన్సెక్స్ 192 పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి 102 పాయింట్లు పడిపోయింది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో 666 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 48 పాయింట్ల లాభంతో ప్రారంభమై 9 పాయింట్లు నష్టపోయింది. అక్కడినుంచి 194 పాయింట్లు లాభపడింది. చివరికి సెన్సెక్స్ 639 పాయింట్ల లాభంతో 77,303 వద్ద, నిఫ్టీ 194 పాయింట్ల లాభంతో 24,092 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Rally | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 3,075 కంపెనీలు లాభపడగా 1,288 స్టాక్స్ నష్టపోయాయి. 193 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 171 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 43 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Stock Market Rally | అన్ని రంగాలు కళకళ..

దేశీయ స్టాక్ మార్కెట్ లో అన్ని రంగాల షేర్లు లాభాల బాటలో పయనించాయి. నిఫ్టీ ఫార్మా ఇండెక్స్ 2.62 శాతం, యుటిలిటీ ఇండెక్స్ 2.50 శాతం, రియాలిటీ 2.46 శాతం, మీడియా 2.30 శాతం, ఐటీ ఇండెక్స్ 2.20 శాతం, పవర్ 2.05 శాతం, మెటల్ 1.84 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్స్ 1.71 శాతం, ఐటీ 2.20 శాతం, ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్‌లు 1.56 శాతం, టెలికాం 1.41 శాతం, ఎనర్జీ 1.40 శాతం పెరిగాయి.

Top gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 22 స్టాక్స్ లాభపడగా.. 8 స్టాక్స్ నష్టాలతో ముగిశాయి. సన్‌ఫార్మా 7.03 శాతం, రిలయన్స్ 2.88 శాతం, అదానీపోర్ట్స్ 2.72 శాతం, టెక్ మహీంద్రా 2.64 శాతం, ఎంఅండ్ ఎం 2.20 శాతం లాభపడ్డాయి.

Top losers : యాక్సిస్ బ్యాంక్ 3.05 శాతం, బీఈఎల్ 2 శాతం, ట్రెంట్ 0.90 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.85 శాతం, ఎటర్నల్ 0.45 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: April 27 Gold Rates | తగ్గిన బంగారం ధర.. మార్కెట్‌లో మారుతున్న ట్రెండ్!

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

April 30 Gold Rates | మ‌రింత త‌గ్గుతున్న బంగారం ధ‌ర‌.. కొనుగోలుదారులకు ఊరట!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Gold Rates | అంతర్జాతీయ మార్కెట్‌లో...

April 30 Horoscope | సమాజంలో పెరగనున్న కీర్తి ప్రతిష్ఠలు.. ఈ రాశుల వారి వ్యక్తిత్వానికి ఫిదా అవ్వాల్సిందే!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: April 30 Horoscope | ఇవాళ గ్రహ గతులను బట్టి...

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...