Stock Market Fall | కొనసాగిన పతనం.. నష్టాలతో ముగిసిన సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్ లో మంగళవారం సైతం పతనం కొనసాగింది. సెన్సెక్స్ 243 పాయింట్లు, నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Fall | హార్మూజ్ జలసంధి (Strait of Hormuz) నియంత్రణపై అమెరికా, ఇరాన్‌ల మధ్య నెలకొన్న ప్రతిష్టంభనతో ముడి చమురు ధరలు అదుపులోకి రావడం లేదు. దీనికితోడు పెరుగుతున్న ప్రపంచ బాండ్ దిగుబడుల ప్రభావం స్టాక్ మార్కెట్‌పై కొనసాగుతోంది. దీంతో ప్రధాన ఆసియా మార్కెట్లలో నష్టాల పరంపర కొనసాగింది.

Stock Market Fall | రోజంతా నష్టాల్లోనే..

ఆసియా మార్కెట్లలోని బలహీనతను అనుసరిస్తూ దేశీయ ఈక్విటీలు కూడా మంగళవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఒకానొక దశలో ప్రధాన సూచీలు ఒక శాతం వరకు పడిపోయాయి. అయితే వాల్యూ బయ్యింగ్ తో తర్వాత కోలుకున్నాయి. ఉదయం సెన్సెక్స్ 138 పాయింట్ల నష్టంతో ప్రారంభమై మొదట్లో 51 పాయింట్లు పెరిగింది. అక్కడినుంచి 620 పాయింట్లు కోల్పోయింది. నిఫ్టీ 48 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా మొదట్లో 21 పాయింట్లు పెరిగింది. తిరిగి అమ్మకాల ఒత్తిడితో 184 పాయింట్లు పతనమైంది. కనిష్టాల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో కోలుకుని పైకి ఎగబాకాయి. చివరికి సెన్సెక్స్ 243 పాయింట్ల నష్టంతో 72,529 వద్ద, నిఫ్టీ 64 పాయింట్ల నష్టంతో 22,716 వద్ద స్థిరపడ్డాయి.

Stock Market Fall | రాణించిన ఫార్మా, మెటల్, టెలికాం షేర్లు..

ఫార్మా, మెటల్, టెలికాం రంగాల షేర్లు రాణించగా.. కన్జూమర్ డ్యూరెబుల్, ఆటో, ఎఫ్ ఎంసీజీ, ఆయిల్ అండ్ గ్యాస్, రియాలిటీ, బ్యాంకింగ్ మరియు ఫైనాన్షియల్ రంగాల షేర్లు నష్టాల బాటలో పయనించాయి.

Stock Market Fall | అడ్వాన్సెస్ అండ్ డిక్లయిన్స్..

బీఎస్ఈలో నమోదైన కంపెనీలలో 1,975 కంపెనీలు లాభపడగా 2,405 స్టాక్స్ నష్టపోయాయి. 216 కంపెనీలు ఫ్లాట్‌గా ముగిశాయి. 129 కంపెనీలు 52 వారాల గరిష్టాల వద్ద ఉండగా.. 232 కంపెనీలు 52 వారాల కనిష్టాల వద్ద కదలాడాయి.

Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 12 కంపెనీలు లాభాలతో, 18 కంపెనీలు నష్టాలతో ముగిశాయి. అదానీ పోర్ట్స్ 4.39 శాతం, సన్‌ఫార్మా 1.09 శాతం, టాటా స్టీల్ 1.05 శాతం, కొటక్ బ్యాంక్ 1 శాతం, ఎన్టీపీసీ 0.92 శాతం లాభపడ్డాయి.

Top Losers : టైటాన్ 2.72 శాతం, హెచ్సీఎల్ టెక్ 2.29 శాతం, టీసీఎస్ 1.72 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.57 శాతం, హెచ్యూఎల్ 1.53 శాతం నష్టపోయాయి.

ఇది కూడా చదవండి..: Oil Crisis | చమురు సంక్షోభం.. మార్కెట్లలో ఆగని పతనం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *