అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market Rally | ఇరాన్, అమెరికాల మధ్య యుద్ధాన్ని ముగించే ప్రయత్నాలు జరుగుతుండడంతో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టాయి. బ్యారెల్ ధర 111 డాలర్లకు తగ్గింది. దీంతోపాటు ఊహించిన దానికంటే మెరుగైన త్రైమాసిక ఆర్థిక ఫలితాలు సాధించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు దూకుడు ప్రదర్శిస్తున్నాయి. దీంతో ప్రధాన సూచీలు పరుగులు తీస్తున్నాయి.
Stock Market Rally | లాభాలతో ప్రారంభం..
దేశీయ స్టాక్ మార్కెట్ (Domestic stock market) నూతన వారాన్ని పాజిటివ్‌గా ప్రారంభించాయి. ఉదయం సెన్సెక్స్ 719 పాయింట్ల గ్యాప్ అప్ లో ప్రారంభమై మొదట్లో 81 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 460 పాయింట్లు పైకి ఎగబాకింది. నిఫ్టీ 169 పాయింట్ల లాభంతో ప్రారంభమై మొదట్లో 11 పాయింట్లు తగ్గింది. అక్కడినుంచి 149 పాయింట్లు పెరిగింది. మధ్యాహ్నం 12.20 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 965 పాయింట్ల లాభంతో 75,425 వద్ద, నిఫ్టీ 285 పాయింట్ల లాభంతో 23,338 వద్ద ఉన్నాయి.
Top Gainers : బీఎస్ఈ సెన్సెక్స్ 30 ఇండెక్స్‌లో 23 స్టాక్స్ లాభాలతో, 7 స్టాక్స్ నష్టాలతో సాగుతున్నాయి. రిలయన్స్ 7.86 శాతం, టాటా స్టీల్ 4.68 శాతం, మారుతి 2.79 శాతం, ఎన్టీపీసీ 2.50 శాతం, బీఈఎల్ 2.28 శాతం లాభాలతో ఉన్నాయి.
Top Losers : ఇన్ఫోసిస్ 1.22 శాతం, సన్‌ఫార్మా 0.85 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.71 శాతం, అదానీపోర్ట్స్ 0.24 శాతం, ఐటీసీ 0.24 శాతం నష్టాలతో ఉన్నాయి.
ఇది కూడా చదవండి..: EPFO WhatsApp Service | పీఎఫ్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఇకపై ఒక్క ‘Hi’ మెసేజ్‌తో వాట్సాప్‌లోనే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు