అక్షరటుడే వెబ్‌డెస్క్: Pelican Steel | భారతదేశంలో ( India )నిర్మాణం, మౌలిక సదుపాయాలు, తయారీ , ఇంజనీరింగ్ రంగాల నుంచి పెరుగుతున్న డిమాండ్‌ను తట్టుకునేలా అర్సెలర్‌మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా (AM/NS ఇండియా) సరికొత్త ప్రీమియం గాల్వనైజ్డ్ స్టీల్ బ్రాండ్ ‘పెలికాన్’ (Pelican)ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. కస్టమర్ల ప్రత్యేక అవసరాలకు తగినట్లుగా విలువైన స్టీల్ పరిష్కారాలను అందించే తమ పోర్ట్‌ఫోలియోను మరింత శక్తివంతం చేసే దిశగా కంపెనీ ఈ అడుగు వేసింది.
ప్రస్తుతం పారిశ్రామిక విస్తరణ పెరుగుతున్న నేపథ్యంలో మన్నికైన, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన తుప్పు-నిరోధక ఉక్కు ఉత్పత్తులకు గిరాకీ విపరీతంగా పెరుగుతోంది. అంచనాల ప్రకారం, భారతదేశ గాల్వనైజ్డ్ స్టీల్ మార్కెట్ 2025 నాటికి 7.65 మిలియన్ టన్నులకు చేరుకుంటుందని, 2030 నాటికి ఏటా 8% వృద్ధి సాధిస్తుందని భావిస్తున్నారు.
Pelican Steel | పెలికాన్ ప్రత్యేకతలు..
గాల్వనైజ్డ్ స్టీల్‌పై ఉండే రక్షణాత్మక పూత ఉక్కును తుప్పు మరియు క్షయం నుంచి సమర్థవంతంగా కాపాడుతుంది. కస్టమర్లకు నమ్మకమైన రక్షణ, స్థిరమైన నాణ్యతతో ఇది తయారైంది. దీని ఉన్నతమైన క్షయం నిరోధకత, ఏకరీతి పూత నాణ్యత, అద్భుతమైన ఆకృతిని ఇచ్చే గుణం కారణంగా మన్నిక కోరుకునే చోట ఇది పర్ఫెక్ట్ ఛాయిస్. పైకప్పులకు మద్దతునిచ్చే విభాగాలు, ట్యూబ్‌లు, ఎయిర్ కండిషనింగ్, వెంటిలేషన్ సిస్టమ్స్, కేబుల్ ట్రేలు, ఫెన్సింగ్, ఫర్నిచర్, డ్రమ్స్, బారెల్స్‌తో పాటు సాధారణ ఇంజనీరింగ్ అవసరాలకు దీన్ని విస్తృతంగా వాడవచ్చు. దేశవ్యాప్తంగా ఉన్న AM/NS ఇండియా విస్తృతమైన పంపిణీ నెట్‌వర్క్ ద్వారా ఈ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి.
Pelican Steel | ఉన్నతమైన గాల్వనైజ్డ్ స్టీల్..
ఈ సందర్భంగా AM/NS ఇండియా సేల్స్ & మార్కెటింగ్ డైరెక్టర్ రంజన్ ధర్ మాట్లాడుతూ.. కస్టమర్ల నిర్దిష్ట అవసరాలకు తగినట్లుగా నమ్మకమైన తుప్పు రక్షణను అందించే ఉన్నతమైన గాల్వనైజ్డ్ స్టీల్‌ను ‘పెలికాన్’ రూపంలో తెచ్చినట్లు తెలిపారు. మౌలిక సదుపాయాలు, నిర్మాణ రంగాల్లో పెరుగుతున్న అవసరాలను తీర్చేందుకు కంపెనీ ఇప్పటికే ‘స్ట్రక్ట్రోమాక్స్’ (నిర్మాణాల కోసం), ‘వెల్డ్ స్టార్’ (భారీ యంత్రాల తయారీ కోసం) వంటి ప్రత్యేక బ్రాండ్లను తీసుకొచ్చింది. ఇప్పుడు ‘పెలికాన్’ను కూడా వాటికి జత చేయడం ద్వారా కస్టమర్-సెంట్రిక్ ఉక్కు పరిష్కారాలను విస్తృతం చేయాలన్న తమ వ్యూహాన్ని AM/NS ఇండియా మరింత ముందుకు తీసుకెళ్తోంది.
ఇది కూడా చదవండి: Bhatti Vikramarka Comments | శుద్ధి చేయాల్సింది నేలను కాదు, మీ కులబుద్ధిని: భట్టి విక్రమార్క