అక్షరటుడే,బోధన్: Food Safety Raids | బోధన్ (Bodhan) పట్టణంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు(Food Safety Officials) దాడులు నిర్వహించారు. ఐదు హోటళ్లు సీజ్ చేశారు.
Food Safety Raids | పాడైన మయోనైస్..
టీజీ సేఫ్ తెలంగాణ కమిషనర్ ఆదేశాల మేరకు.. జిల్లా ఆహార భద్రత అధికారిణి నవిత ఆధ్వర్యంలో బృందం బుధవారం ఉదయం బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా, రాకాసీపేట ప్రాంతంలో ఉన్న హోటళ్లు, రెస్టారెంట్లు, టీ షాపులు, మండీలు మరియు ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల సందర్భంగా 3.5 కిలోల పాడైన మయోనైస్, 10 కిలోల పాడైన టమోటాలు, సింథటిక్ ఆహార రంగులు, కృత్రిమ రంగులు కలిపిన చికెన్, కుళ్లిన చికెన్, రంగులు కలిపిన జిలేబీలు, అపరిశుభ్రమైన పరిస్థితులు గుర్తించారు.
పాడైన, సురక్షితం కాని ఆహార పదార్థాలన్నింటినీ అక్కడికక్కడే ధ్వంసం చేసి పారవేశారు. అనంతరం లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తూ, సరైన పరిశుభ్రత ప్రమాణాలను పాటించని ఐదు ఆహార వ్యాపార సంస్థలకు వ్యాపార కార్యకలాపాలను మూసివేయాలని నోటీసులు జారీ చేశారు. ఎఫ్ఎస్ఎస్ఏఐ (FSSAI) చట్టం ప్రకారం అవసరమైన లైసెన్స్ పొందడంతో పాటు, గుర్తించిన లోపాలను సరిదిద్దే వరకు వ్యాపార కార్యకలాపాలు కొనసాగించరాదని స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి: శాసనసభ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల సస్పెన్షన్