అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Assembly Incident | శాసనసభ వర్షాకాల సమావేశాల తొలిరోజు చోటుచేసుకున్న సంఘటనల విషయంలో బాధ్యులైన వారందరిపై సమగ్ర విచారణ జరిపించి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.
వర్షాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నల్ల టీ షర్టులు ధరించి సభకు వచ్చిన విషయం తెలిసిందే. వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు స్పీకర్‌ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. అలాగే ఎమ్మెల్యేలు, పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ మేరకు ఇప్పటికే పోలీసులు కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. తాజాగా సీఎం మాట్లాడుతూ.. ఈ ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
Assembly Incident | వారిని వదిలిపెట్టం
స్పీకర్‌కు ప్రభుత్వం అండగా నిలబడుతుందని సీఎం పేర్కొన్నారు. సభాపతి మనసును గాయపరిచిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని హెచ్చరించారు. కొందరు అధికారులపై దాడులు చేయడమే కాకుండా స్పీకర్ స్థానాన్ని అవమానించేలా వ్యవహరించారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పథకం ప్రకారం దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగా ఈ సంఘటనను అభివర్ణించారు.
Assembly Incident | విచారణకు ఆదేశం
అసెంబ్లీ ఘటనలపై ప్రత్యేక విచారణకు సీఎం రేవంత్ ఆదేశించారు. విచారణ అధికారిగా విజయ్‌కుమార్‌ను నియమించారు.
దీనిని కూడా చదవండి : DIEO Caught by ACB | లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన డీఐఈవో