MLA Prashanth Reddy | కేసీఆర్​పై దాడి చేసేందుకు కాంగ్రెస్​ ప్లాన్​: మాజీ మంత్రి వేముల ప్రశాంత్​రెడ్డి

కేసీఆర్​పై దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: MLA Prashanth Reddy | కేసీఆర్​ (KCR)పై దాడి చేసేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్ చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్​ఎస్​ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్​రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేసీఆర్ చావు గురించి అనేక సార్లు మాట్లాడారని గుర్తు చేశారు.

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కేసీఆర్ చావు కోరుకున్నారని వేముల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంపై వేముల వీరేశం దాడి చేస్తానని అన్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్​ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ చావును కోరుకోవడం సంస్కారమా అని ప్రశ్నించారు. కేసీఆర్​పై దాడి చేయాలని పక్కా ప్లాన్​తో కొందరు ఎమ్మెల్యేలు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం దగ్గరే ఉన్నారని ఆయన ఆరోపించారు.

MLA Prashanth Reddy | దమ్ముంటే రాజకీయంగా ఎదుర్కోవాలి

‘రేవంత్ రెడ్డి నువ్వు మొగోడివే అయితే రాజకీయంగా కేసీఆర్​ను ఎదుర్కో’ అని వేముల సవాల్​ విసిరారు. పోలీసులను, గుండాలను అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తానంటే నడవదన్నారు. కేసీఆర్ చావు గురించి ఇద్దరి ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డే మాట్లాడించారని ఆరోపించారు. ప్రజల సమస్యల పై చర్చించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం డైవర్ట్ పాలిటిక్స్ చేస్తుందని కుత్బుల్లాపూర్​ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్​ అన్నారు. తోటి మహిళలను అవమానించే విధంగా మంత్రి సీతక్క మాట్లాడారని మండిపడ్డారు. మహిళ ఎమ్మెల్యేలు ఉంటే మగ పోలీసులను, పురుష ఎమ్మెల్యేల ముందు ఆడ పోలీసులను ముందు పెడుతున్నారని ఆరోపించారు.

ఇది కూడా చదవండి..: KCR Farmhouse | ఎర్రవల్లిలో ఉద్రిక్తత.. కేసీఆర్​ ఫామ్‌హౌస్ వద్ద భారీ భద్రత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *