KCR Farmhouses | కేసీఆర్​ కుటుంబానికి ఫామ్​హౌజ్​లు ఎక్కడివి : సీఎం రేవంత్​రెడ్డి

బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్​హౌజ్​లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KCR Farmhouses | బీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​పై సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) తీవ్ర విమర్శలు చేశారు. ఆయన కుటుంబానికి అన్ని ఫామ్​హౌజ్​లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.

మహబూబ్​నగర్​ జిల్లా మిడ్జిల్ (​Midjil) మండల కేంద్రంలో నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు. 2006 జులై 4న మిడ్జిల్‌ మండల ప్రజలు ఆశీర్వదించారన్నారు. ఆరోజు మిడ్జిల్‌ ప్రజలు నాటిన మొక్క.. ఇవాళ పెద్ద వృక్షమైందని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానంలో కీలకమైన మిడ్జిల్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నాడు జెడ్పీటీసీగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన మిడ్జిల్‌ ప్రజలు గెలిపించారని పేర్కొన్నారు. మిడ్జిల్‌ ప్రజలు తనపై పెట్టిన నమ్మకమే.. ఇవాళ ఈస్థాయికి తీసుకెళ్లిందన్నారు.

KCR Farmhouses | రబ్బానీకి పదవి ఇవ్వాలి

revanth reddy 1

మిడ్జిల్ జెడ్పీటీసీగా 2006లో తాను కాంగ్రెస్​ అభ్యర్థి రబ్బానిపై గెలిచానన్నారు. నాడు రబ్బానిని జెడ్పీ ఛైర్మన్​ చేయాలని అప్పటి సీఎం వైఎస్​ఆర్​ భావించారని, కానీ ప్రజలు తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. నాడు తన చేతిలో ఓడిన రబ్బానికి ప్రస్తుతం ప్రభుత్వంలో ఒక మంచి బాధ్యత ఇవ్వాలని సూచించారు. 35 ఏళ్లుగా రబ్బాని కాంగ్రెస్​ కోసం పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మిడ్జిల్​ మండలాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను రేవంత్​రెడ్డి కోరారు. 20 ఏళ్లలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోలేదని చెప్పారు.

KCR Farmhouses | ప్రజలను దోచుకొని..

ప్రజలను దోచుకొని కేసీఆర్​ కుటుంబం ఫామ్​హౌజ్​లు నిర్మించుకుందని సీఎం ఆరోపించారు. ఎర్రవల్లిలో వెయ్యి ఎకరాల ఫామ్​హౌజ్​ ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు. కేటీఆర్​కు జన్వాడలో 100 ఎకరాల్లో ఫామ్​హౌజ్​, హరీశ్​రావుకు మొయినాబాద్​లో 50 ఎకరాల ఫాహ్​హౌజ్​, కవితకు శంకర్​పల్లిలో 25 ఎకరాల్లో ఫామ్​హౌజ్​లు ఎక్కడి నుంచి వచ్చాయన్నారు. పదేళ్లలో ఇన్ని ఆస్తులు ఎలా సంపాదించారని ప్రశ్నించారు.

KCR Farmhouses | పాపాల భైరవుడు కేసీఆర్​

సీఎం రేవంత్​రెడ్డి కేసీఆర్​పై విమర్శలు చేశారు. నాడు గద్దర్​ కలవడానికి వెళ్తే ఫామ్​హౌస్​ ఎదుట 4 గంటల పాటు ఎండలో నిల్చొబెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలకంగా పని చేసిన గద్దర్​ను ఎండలో నిల్చొబెట్టిన ఆయనకు ఉరిశిక్ష వేసిన తక్కువే అన్నారు. ఫామ్​హౌజ్​లో బంధించిన పాపల భైరవుడు రావాలని ఆయన కుమారుడు, అల్లుడు బయట తిరుగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్​ఎస్​ హయాంలో వారితో పాటు దోపిడీ చేసిన అధికారులు ఈ రోజు రూ.వందల కోట్లు అక్రమాస్తులతో ఏసీబీకి పట్టుబడుతున్నారని తెలిపారు. దొర దురహంకారాన్ని మరోసారి బొంద పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.

దీనిని కూడా చదవండి : Tribal Development Telangana | గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : మంత్రి సీతక్క

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *