Telangana University Exams | తెయూ పరిధిలో వన్​టైం ఛాన్స్ డిగ్రీ పరీక్షలు ప్రారంభం

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో వన్​టైం ఛాన్స్​ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు.

shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Exams | తెలంగాణ యూనివర్సిటీ (TU Nizamabad) పరిధిలో వన్​టైం ఛాన్స్​ డిగ్రీ పరీక్షలు ప్రారంభమయ్యాయని ఆడిట్ సెల్ డైరెక్టర్  చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

Telangana University Exams | బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్సులు..

ఆయన మాట్లాడుతూ.. డిగ్రీ బీఏ, బీ కాం, బీఎస్సీ, బీబీఏ కోర్సుల 1, 2, 3, 4, 5, 6, 7 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్(2016, 2017, 2018, 2019, 2020 బ్యాచ్) పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమయ్యాయన్నారు. ఉదయం జరిగిన పరీక్షకు 47 మంది విద్యార్థులకు 43 మంది హాజరైనట్లు తెలిపారు.

Telangana University Exams | 16 నుంచి బీఈడీ పరీక్షలు..

తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో బీఈడీ పరీక్షలు (BEd Exams) 16వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయని కంట్రోలర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. బీఈడీ రెండో సెమిస్టర్ రెగ్యులర్/ 1,2,3,4 సెమిస్టర్ల బ్యాక్‌లాగ్ (2022 బ్యాచ్ నుంచి) థియరీ పరీక్షలకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ పరీక్షల పూర్తి వివరాలు తెలంగాణ యూనివర్సిటీ వెబ్ సైట్​లో పొందుపర్చామన్నారు.

TU

ఇది కూడా చదవండి: ఓటరు ఫారం సమర్పించిన ఉపరాష్ట్రపతి 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *