Hotel Inspections | ఫాస్ట్​ఫుడ్​ సెంటర్లు, హోటళ్లపై మున్సిపల్​ అధికారుల దాడులు

బోధన్​ పట్టణంలోని పలు హోటళ్లు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై మున్సిపల్​ అధికారులు దాడులు చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే: బోధన్ : Hotel Inspections | పట్టణంలోని (Bodhan Municipality) పలు హోటళ్లు, ఫాస్ట్​ ఫుడ్​ సెంటర్లపై మున్సిపల్​ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా శుభ్రత పాటించని హోటళ్లకు (Hotel Inspections) జరిమానాలు విధించారు..

Hotel Inspections | మున్సిపల్​ కమిషనర్​ ఆధ్వర్యంలో..

బోధన్ మున్సిపల్(Municipal Commissioner) కమిషనర్ జాదవ్ కృష్ణ ఆధ్వర్యంలో హోటళ్లు, బేకరీల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. పరిశుభ్రత నిబంధనలు పాటించని గాయత్రి టిఫిన్ సెంటర్, అరోమా హోటల్, గణేష్ ఇడ్లీ సెంటర్, ఏషియన్ బేకరీలకు రూ.500 చొప్పున బావర్చి హోటల్​కు రూ.1000 జరిమానా విధించారు. పరిశుభ్రత పాటించడంతో పాటు ప్లాస్టిక్ వినియోగం మానుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణ పరిధిలో అధికారుల ఆధ్వర్యంలో నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. ప్రజలు సైతం ప్లాస్టిక్​ వినియోగానికి దూరంగా ఉండాలని కోరారు. జూట్​ బ్యాగ్​లను ఎక్కువగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్సైలు గణేష్​, దత్తారావు తదితరులు పాల్గొన్నారు.

hotel hotel1

ఇది కూడా చదవండి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్‌కర్నూల్ జిల్లా ఉరుకొండపేట పబ్బతి ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రూ. 10 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *