అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Nagarjuna Sagar | నాగార్జున సాగర్ నుంచి నీటి విడుదల విషయంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ మధ్య మరోసారి వివాదం నెలకొంది. సాగర్ కుడి కాలువ నుంచి ఏపీ అధికారులు తాగునీటి విడుదల చేపట్టారు. దీనిపై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేసింది.
సాగర్ నుంచి కుడి కాలువ ద్వారా ఏపీ అధికారులు బుధవారం 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కేఆర్ఎంబీ (KRMB) నుంచి అనుమతులు లేకుండానే నీటి విడుదల చేపట్టడంపై తెలంగాణ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినా ఏపీ అధికారులు పట్టించుకోకపోవడంతో ఎడమ కాలువకు కూడా తెలంగాణ నీటిపారుదల శాఖ అధికారులు నీటిని విడుదల చేశారు. 500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య వివాదం రాజుకుంది. కృష్ణా నది (Krishna River)పై గల నాగార్జున సాగర్ నిర్వాహణను తెలంగాణ అధికారులు, శ్రీశైలం డ్యామ్ నిర్వాహణను ఏపీ అధికారులు చూస్తున్న విషయం తెలిసిందే.
Nagarjuna Sagar | నిండకముందే..
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా కురిశాయి. వానాకాలం సీజన్ మరో నెల రోజులు మాత్రమే ఉంది. అయినా కూడా నాగార్జున సాగర్ (Nagarjuna Sagar)కు భారీగా వరద రావడం లేదు. ఎగువన కర్ణాటకలో కురిసిన వర్షాలతో కృష్ణానదికి వరద వచ్చింది. దీంతో జూరాల ప్రాజెక్టు నిండింది. శ్రీశైలం జలాశయానికి సైతం భారీగా వరద వచ్చింది. దీంతో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించడంతో నాగార్జున సాగర్‌కు వరద వచ్చింది. అయితే ఇంకా శ్రీశైలం ప్రాజెక్ట్ సైతం నిండలేదు. మరోవైపు సాగర్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 180 టీఎంసీల నీరు నిల్వ ఉంది. సాగర్ నిండాలంటే భారీగా వరద రావాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 21,241 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. అయితే ప్రాజెక్ట్ నిండకముందే అధికారులు కేఆర్ఎంబీ అనుమతులు లేకుండా నీటి విడుదల చేపట్టడం గమనార్హం.
నాగార్జున సాగర్ డ్యాంపై ఏపీ అధికారుల దౌర్జన్యం
కేఆర్ఎంబీ అనుమతి లేకుండానే అక్రమంగా కుడి కాలువకు నీటిని విడుదల చేసుకున్న ఏపీ ఇరిగేషన్ అధికారులు
దీంతో పోటీగా ఎడమ కాలువకు నీటిని విడుదల చేసిన తెలంగాణ ఇరిగేషన్ అధికారులు
తెలంగాణ నీటిపారుదల శాఖ నిర్వహణలో ఉన్న నాగార్జున సాగర్… pic.twitter.com/Wu7igUSI16
— Telugu Scribe (@TeluguScribe) August 26, 2026
దీనిని కూడా చదవండి : Konda Murali | కాంగ్రెస్‌ను వీడేది లేదు.. కొండా మురళి కీలక వ్యాఖ్యలు