అక్షరటుడే, వెబ్‌డెస్క్ : TIMS Sanath Nagar | సనత్‌నగర్‌లో నిర్మించిన డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS Sanath Nagar) ప్రారంభోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లను ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ (Rajanarsihma) ఆదివారం పరిశీలించారు. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టిమ్స్‌ను ప్రారంభించనున్న నేపథ్యంలో హాస్పిటల్ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మంత్రి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.
మంత్రి రాజనర్సింహ ఆరోగ్యశాఖ, పోలీస్, జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ, సమాచార పౌర సంబంధాల శాఖ, ట్రాఫిక్ పోలీస్ తదితర శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా కార్యాచరణ రూపొందించాలని ట్రాఫిక్ పోలీసులకు సూచించారు.
TIMS Sanath Nagar | లోపాలకు తావు లేకుండా..
భద్రతా ఏర్పాట్లలో ఎలాంటి లోపాలకు తావు లేకుండా పోలీస్, ఇతర శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు. కార్యక్రమ ప్రాంగణంలో ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, బందోబస్తు, క్రౌడ్ మేనేజ్‌మెంట్, అత్యవసర పరిస్థితుల్లో స్పందించే వ్యవస్థలను ముందుగానే పరిశీలించాలని సూచించారు. హాస్పిటల్ పరిసరాల్లో పారిశుధ్యం, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ క్రిస్టినా జడ్ చొంగ్తు, కమిషనర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ, టిమ్స్ డైరెక్టర్ నరేంద్ర కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్, జలమండలి ఎండీ అశోక్ రెడ్డి, అదనపు డీసీపీ (ట్రాఫిక్) వేణుగోపాల్ రెడ్డి పాల్గొన్నారు.
సనత్‌నగర్‌లోని డాక్టర్ మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (MCH) ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.
సోమవారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ ప్రతిష్టాత్మక వైద్య సంస్థ ప్రారంభం కానుంది.
ఈ నేపథ్యంలో ప్రారంభోత్సవ… pic.twitter.com/aoo2LiymGl
— Damodar Raja Narasimha (@DamodarCilarapu) August 16, 2026
దీనిని కూడా చదవండి : Telangana Ration Card Check | స్మార్ట్ రేషన్ కార్డు స్టేటస్.. ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోండిలా!