అక్షరటుడే వెబ్‌డెస్క్: Telangana Ration Card Check | తెలంగాణలో ( Telangana )రేషన్ కార్డు లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. ఇప్పటికే ఉన్న 2.81 కోట్ల మందికి అదనంగా మరో 62 లక్షల మందిని కొత్తగా రేషన్ కార్డుల జాబితాలో చేర్చడంతో, రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారుల సంఖ్య 3.42 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ పేర్లు, కుటుంబ సభ్యుల వివరాలు, స్మార్ట్ రేషన్ కార్డు స్థితిని ఆన్‌లైన్‌లో సులభంగా ఎలా సరిచూసుకోవాలో కింద చూడవచ్చు.
Telangana Ration Card Check | చెక్ చేసుకునే విధానం..
రేషన్ కార్డు వివరాలను ఆన్‌లైన్‌లో చెక్ చేసుకోవడానికి, ముందుగా తెలంగాణ పౌర సరఫరాల శాఖ అధికారిక వెబ్‌సైట్ https://epds.telangana.gov.in/FoodSecurityAct/ లోకి వెళ్లాలి. హోమ్‌పేజీలో కనిపించే ‘FSC Search’ ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ పాత రేషన్ కార్డు నంబర్ లేదా కొత్తగా దరఖాస్తు చేసినప్పుడు ఉన్న కుటుంబ సభ్యుల వివరాలను నమోదు చేసి వెతకాలి. ఆ తర్వాత వివరాలు టైప్ చేసి ‘Search’ బటన్‌పై క్లిక్ చేయగానే, మీ కుటుంబానికి సంబంధించిన రేషన్ కార్డు డేటా స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇది కనిపిస్తే మీ వివరాలు విజయవంతంగా నమోదైనట్లే.
Telangana Ration Card Check | వివరాలు కనిపించకపోతే ఏం చేయాలి?
ఒకవేళ ఆన్‌లైన్‌లో మీ వివరాలు కనిపించకపోతే వెంటనే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. డేటా అప్‌డేట్ ప్రక్రియలో భాగంగా కొన్ని వివరాలు నమోదు కావడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ ఏవైనా సందేహాలు ఉంటే, మీ వివరాలను ధృవీకరించుకోవడానికి నేరుగా సమీపంలోని మండల పౌర సరఫరాల అధికారి (ASO) కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. దీని కోసం ఎంఆర్వో (MRO) లేదా ఎంపీడీఓ (MPDO) కార్యాలయాలకు వెళ్లాల్సిన పనిలేదు. అలాగే, ఏవైనా సహాయం లేదా సందేహాల కోసం పౌర సరఫరాల శాఖ అధికారిక హెల్ప్‌లైన్ నంబర్ 1800-425-0033 కు కాల్ చేసి సమాచారం పొందవచ్చు.
ఇది కూడా చదవండి: Priyanka Murder Case | డాక్టర్ ప్రియాంక హత్య కేసు.. దర్యాప్తునకు ఐపీఎస్ అధికారి పాటిల్ దేవరాజ్ నియామకం
New Ration card