Divyastra Mk3 | దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం

స్వదేశీయంగా అభివృద్ధి చేసిన దివ్యాస్త్ర ఎంకే–3 పరీక్ష విజయవంతం అయింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Divyastra Mk3 | భారత అమ్ములపొదిలో మరో అస్త్రం చేరనుంది. కావా యూఏవీ (Kawa UAV) ప్రైవేట్ లిమిటెడ్ దేశీయంగా అభివృద్ధి చేసిన తదుపరి తరం జెట్ శక్తితో పనిచేసే లోయిటరింగ్ మ్యూనిషన్ అయిన దివ్యాస్త్ర ఎంకే3ను విజయవంతంగా ప్రయోగించింది.

దివ్యాస్త్ర Mk3 ప్రయోగం తర్వాత ‘ఆత్మనిర్భర్ భారత్’ కార్యక్రమానికి ఇది ఒక కీలక మైలురాయి అని ఆ సంస్థ పేర్కొంది. జెట్-ఆధారిత ఖచ్చితమైన లక్ష్య ఛేదన వ్యవస్థలను తయారు చేసి, ప్రయోగించే సామర్థ్యం ఇప్పుడు భారత్‌కు ఉందని సంస్థ సహ-వ్యవస్థాపకులు తెలిపారు. దివ్యాస్త్ర Mk3 జెట్ ఇంజిన్ శక్తితో పనిచేస్తుంది. నిర్దిష్ట లక్ష్యాలపై ఖచ్చితమైన దాడులు చేస్తుంది. దివ్యాస్త్ర ఎంకే3 భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ జెట్ శక్తితో పనిచేసే ఆయుధమని ఆదివారం సంస్థ తెలిపింది.

Divyastra Mk3 | గాలిలో ఉండి..

దివ్యాస్త్ర ఎంకే3 కొంత సమయం పాటు గాలిలో నిలిచి, లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత దానిపై దాడి చేస్తోంది. దీనిని ‘కామికాజీ డ్రోన్’ అని పిలుస్తారు. ఆ సంస్థ ఏడాదిలోనే దీనిని అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థలో ఉపయోగించిన జెట్ ఇంజన్ కూడా దేశీయంగా తయారు చేసిందే. కావా యూఏవీ ప్రైవేట్ లిమిటెడ్ సహ-వ్యవస్థాపకులు మాట్లాడుతూ.. ఇది కేవలం ఒక పరీక్షా ప్రయోగం కాదని, భారతదేశ సాంకేతిక పరాక్రమానికి, స్వావలంబనకు నిదర్శనమని పేర్కొన్నారు.

దీనిని కూడా చదవండి : Ashish Banerjee Suicide | రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశా.. సూసైడ్​ నోట్​లో టీఎంసీ మాజీ ఎమ్మెల్యే

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *