Karnataka MLA Daughter | మహిళా పోలీసును కొట్టిన ఎమ్మెల్యే కూతురు

కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే కూతురు మహిళా ఎస్సైపై దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Karnataka MLA Daughter | కర్ణాటకలో బీజేపీ ఎమ్మెల్యే (BJP MLA) కూతురు మహిళా ఎస్సైపై దాడి చేశారు. ఈ ఘటన ఆగస్టు 12న చోటు చేసుకోగా.. తాజాగా పోలీసులు కేసు నమోదు చేశారు.

మండ్య జిల్లా శ్రీరంగపట్టణ తాలూకాలోని ఆరతి ఉక్కడ ఆలయంలో ప్రత్యేక భద్రతా విధుల్లో ఉన్న ఒక మహిళా సబ్ ఇన్‌స్పెక్టర్‌పై బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె దాడి చేశారు. ఆగస్టు 12న రాత్రి 8:15 గంటలకు భీమ అమావాస్య వేడుకల సమయంలో ఆలయ ప్రాంగణంలో ఈ ఘటన జరిగింది. బాధితురాలైన సవితా పాటిల్ మండ్య మహిళా పోలీస్ స్టేషన్‌కు చెందిన సబ్-ఇన్‌స్పెక్టర్. బీజేపీ ఎమ్మెల్యే సురేష్​ గౌడ కుమార్తె ఐశ్వర్య సదరు అధికారిని దూషించి, చెంపదెబ్బ కొట్టడమే కాకుండా ఆమె విధులకు ఆటంకం కలిగించారు.

Karnataka MLA Daughter | క్షమాపణ చెప్పిన ఎమ్మెల్యే

ఈ వివాదంపై సదరు రాజకీయ నాయకుడు క్షమాపణలు కోరారు. దర్శనం కోసం ఆలయానికి వచ్చిన ఐశ్వర్య, లోపలికి అనుమతించడంలో జాప్యం జరగడాన్ని ప్రశ్నించిన తర్వాత ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. దీంతో ఎస్సై సవిత ఎమ్మెల్యే కూతురు ఐశ్వర్యపై ఫిర్యాదు చేశారు. దీంతో క్యాతనహళ్లి పోలీసులు కేసు నమోదు చేశారు. నాన్​ బెయిలబుల్ కేసులు నమోదు చేసినప్పటికీ ఆమెను ఇంకా అరెస్ట్​ చేయలేదు. ఈ ఘటనపై ఎమ్మెల్యే సురేష్​ గౌడ స్పందిస్తూ.. తన కుమార్తెను గర్భగుడిలోకి అనుమతించలేదన్నారు. దీంతో గొడవ జరిగిందని తెలిపారు. ఈ క్రమంలో సదరు ఎస్సై తన కుమార్తెను దూషించినట్లు తెలిసిందని చెప్పారు. తన కూతురు ఆ అధికారిని చెంపదెబ్బ కొట్టిన వీడియోను తాను చూడలేదన్నారు. దీనికి ఆయన క్షమాపణలు కోరారు.

దీనిని కూడా చదవండి : Indus Water Treaty | సింధు జలాలపై భారత్​ వైఖరి మారదు : రణధీర్​ జైస్వాల్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *