Free School Shoes | 145 మంది విద్యార్థులకు ఉచితంగా స్కూల్ షూస్ పంపిణీ

“పిల్లల విద్యాభివృద్ధికి మా వంతు సహకారం అందించడం మా కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. విద్యార్థుల చదువుకు ఏ చిన్న సహాయం చేసినా అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

Naresh Chandan

అక్షరటుడే, నందిపేట్: Free School Shoes | సమాజ సేవే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిత్రా బండి రవి దంపతులు మరోసారి తమ మానవత్వాన్ని చాటుకున్నారు.

నందిపేట్ మండలం వన్నెల కే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 145 మంది నిరుపేద విద్యార్థులకు వారు నాణ్యమైన స్కూల్ షూస్‌ను ఉచితంగా పంపిణీ చేసి ఆదర్శంగా నిలిచారు.

Free School Shoes | మూడు నెలల వేతనంతో..

ప్రభుత్వ పాఠశాలలోని హైస్కూల్, ప్రాథమిక పాఠశాల విద్యార్థులను కలిపి మొత్తం 145 మందికి షూస్ అందజేశారు. విద్యార్థుల అవసరాలను గుర్తించి, వారికి అండగా నిలవాలనే ఉద్దేశంతో రవి దంపతులు తమ గత మూడు నెలల జీతాన్ని ఈ సేవా కార్యక్రమానికి వెచ్చించడం విశేషం.

Rajiv Jyothi Sadbhavana Yatra | నిజామాబాద్​కు చేరుకున్న రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర

ఈ సందర్భంగా రవి దంపతులు మాట్లాడుతూ.. “పిల్లల విద్యాభివృద్ధికి మా వంతు సహకారం అందించడం మా కుటుంబానికి దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాం. విద్యార్థుల చదువుకు ఏ చిన్న సహాయం చేసినా అది వారి భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది” అని పేర్కొన్నారు.

విద్యార్థులకు షూస్ పంపిణీ చేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు రవి దంపతులను అభినందించారు. తమ సంపాదనలో కొంత భాగాన్ని విద్యార్థుల సంక్షేమం కోసం వినియోగించడం అభినందనీయమని, సమాజంలోని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల్లో భాగస్వాములు కావడానికి ఇది స్ఫూర్తినిస్తుందని కొనియాడారు.

నిరుపేద విద్యార్థుల అవసరాలను గుర్తించి, తమ శ్రమార్జితాన్ని వారి భవిష్యత్తు కోసం వినియోగించిన రవి దంపతుల సేవాభావం పలువురికి ఆదర్శంగా నిలిచింది.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *