అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Rajiv Jyothi Sadbhavana Yatra | రాజీవ్ జ్యోతి సద్భావన యాత్ర శుక్రవారం నిజామాబాద్‌కు (Nizamabad) చేరుకుంది. యాత్ర అధ్యక్షుడు దొరయ్ వేలు ఆధ్వర్యంలో పెరంబదూర్ నుండి ఢిల్లీ వరకు కొనసాగనున్న 35వ యాత్రకు జిల్లాలో కాంగ్రెస్ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.
Rajiv Jyothi Sadbhavana Yatra | డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడి ఆధ్వర్యంలో..
డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, కాంగ్రెస్ డీసీసీ ఇన్‌ఛార్జి కౌడపు శరత్ కుమార్ యాత్రకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన సేవలను స్మరించుకుంటూ నివాళులు అర్పించారు. బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ రాజీవ్ జ్యోతి యాత్ర దేశంలో శాంతిని పెంపొందించే విధంగా 35ఏళ్ల క్రితం ప్రారంభమైందన్నారు. రాజీవ్ గాంధీ దేశానికి చేసిన సేవలను స్మరించుకుంటూ ముందుకు వెళ్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి భక్తవత్సలం, ఏఐసీసీ కోఆర్డినేటర్ ఘన్‌రాజ్, జిల్లా యూత్ అధ్యక్షుడు విపుల్ గౌడ్, మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ రాజేంద్ర ప్రసాద్, జెండా గుడి ఛైర్మన్ లవంగ ప్రమోద్, మాజీ కార్పొరేటర్ కుడ్డుస్, బంటు బలరామ్, పోల ఉష, అపర్ణ, ఆకుల మహేందర్, జాఫర్, రాజ్ గగన్, సుమీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Telangana Cabinet | ఆటో డ్రైవర్ల కోసం కొత్త స్కీం… తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు