Nizamabad Cycling Competition | 13న జిల్లాస్థాయి సైక్లింగ్​ పోటీలు

జిల్లా స్థాయి సైక్లింగ్​ పోటీలు ఈ నెల 13న తెలంగాణ యూనివర్సిటీలో జరగనున్నాయి.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Nizamabad Cycling Competition | జిల్లాస్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్ సైక్లింగ్ సిటీ లీగ్, వరల్డ్ బైస్కిల్ డే సైక్లింగ్ పోటీలు ఈ నెల 13న నిర్వహించనున్నారు. ఈ మేరకు జిల్లా సైక్లింగ్ అసోసియేషన్​ జిల్లా కార్యదర్శి భూలోకం విజయ్​కాంత్​రావు వివరాలు తెలిపారు.

Nizamabad Cycling Competition | తెలంగాణ యూనివర్సిటీలో..

కేంద్ర ప్రభుత్వం, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, తెలంగాణ సైక్లింగ్​ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా (Nizamabad District) సైక్లింగ్ అసోసియేషన్ సహకారంతో ఈ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. 13వ తేదీన డిచ్​పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీలో ఈ పోటీలు జరుగనున్నట్లు తెలిపారు. 19ఏళ్లు పైబడిన విభాగంలో మహిళలకు, 17, 18 ఏళ్ల వయస్సు జూనియర్​ బాలికలకు, 13 నుంచి 16ఏళ్ల వయస్సు సబ్​జూనియర్​ బాలికలను ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన వివరించారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ సొంత సైకిల్​తో పాటు బర్త్​ సర్టిఫికెట్​, బోనోఫైడ్​తో ఉదయం 8 గంటలకు రిపోర్ట్ చేయాలన్నారు. పోటీల్లో విజయం సాధించిన వారికి పతకాలతో పాటు సర్టిఫికెట్లు అందిస్తామని తెలిపారు.  మరిన్ని వివరాలకు విజయ్ కాంత్ రావ్, నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ కార్యదర్శి 9912883331లో సంప్రదించాలని కోరారు.

Nizamabad Cycling Competition

ఇది కూడా చదవండి..: Nizamsagar Project Tragedy | ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *