Nizamsagar Project Tragedy | ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య

ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. నిజాం సాగర్​ ప్రాజెక్ట్​లో పిల్లలను తోసేసి తాను తనువు చాలించాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Nizamsagar Project Tragedy | ఇద్దరు పిల్లలతో సహా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన నిజాంసాగర్​లో చోటు చేసుకుంది.

Nizamsagar Project Tragedy

సంగారెడ్డి జిల్లా (Sangareddy District) నిజాంపేట‌కు చెందిన కృష్ణ‌(32) తన కుమారుడు రక్షిత్​ (9), కుమార్తె అన‌న్య‌(5)తో కలిసి గురువారం నిజాంసాగర్​ ప్రాజెక్ట్ వద్దకు వచ్చాడు. సాయంత్రం వరకు ప్రాజెక్ట్​ వద్ద పిల్లలతో సరదాగా గడిపాడు. అనంతరం ముగ్గురు అక్కడ భోజనాలు సైతం చేశారు. సాయంత్రం పూట ఇద్దరు పిల్లలను నీటిలో తోసేసి తాను కూడా దూకాడు. కుటుంబ కలహాల కారణంగా ఆయన పిల్లలతో కలిసి సూసైడ్​ చేసుకున్నట్లు సమాచారం.

Nizamsagar Project Tragedy | గాలింపు చర్యలు

Nizamsagar Project Tragedy

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఎన్డీఆర్​ఎఫ్​, అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు. శుక్రవారం ఉదయం ఆరేడు శివారులోని 20 గేట్ల వద్ద మృతదేహాలు లభ్యమయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై శివకుమార్​ తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ముగ్గురి మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

ఇది కూడా చదవండి..: Nizamabad RTC | ఆర్టీసీ ఆర్​ఎంగా ఎస్పీజీకే మూర్తి బాధ్యతల స్వీకరణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *