Telangana Weather | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

తెలంగాణలోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Weather | తెలంగాణ (Telangana)లోని పలు జిల్లాల్లో శుక్రవారం భారీ వర్షం కురుస్తుందని వాతావారణ శాఖ అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో విస్తారంగా వాన పడుతుందని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని భువనగిరి, నాగర్​ కర్నూల్​, రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్ నగర్, వనపర్తి, భద్రాద్రి – కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్‌లలో విస్తారంగా వర్షాలు కురుస్తాయి. కొన్ని చోట్ల 100 మి.మీ. వర్షపాతం నమోదు అయ్యే అవకాశం ఉంది. ఉత్తర, మధ్య తెలంగాణలోని ఇతర జిల్లాల్లో చెదురుమదురు వర్షాలు పడుతాయి.

Telangana Weather | దంచికొట్టిన వాన

Telangana Weather

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గురువారం సాయంత్రం పూట వాన దంచికొట్టింది. నల్గొండ, నాగర్​ కర్నూల్​, సూర్యాపేట, ఖమ్మం, యాదాద్రి, నిజామాబాద్​, నిర్మల్​, జగిత్యాల జిల్లా (Jagtial District)ల్లో వర్షం పడింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే అక్కడక్కడ వర్షాలు పడుతున్నా.. ఎండ తీవ్రత మాత్రం తగ్గడం లేదు. ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Metro Phase 2 | ప్రధాని మోడీతో సీఎం రేవంత్ కీలక భేటీ!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *