Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
ePaper
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - జాతీయం

జాతీయం

Raghava Lawrence Politics | రాఘవ లారెన్స్ ‘పొలిటికల్’ ఎంట్రీ.. ప్రజల నిర్ణయమే కీలకం

తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Shivam nagarani
Last updated: June 12, 2026, 11:37 am 11:37 am
Shivam nagarani
Share
Raghava Lawrence Politics

అక్షరటుడే వెబ్‌డెస్క్: Raghava Lawrence Politics | తమిళనాడు రాజకీయాల్లో రోజురోజుకూ ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నిక ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ స్థానం నుంచి విజయ్ నేతృత్వంలోని టీవీకే (TVK) పార్టీ తరపున ప్రముఖ నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )పోటీ చేస్తారన్న వార్తలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. ఈ నేపథ్యంలో, తన రాజకీయ అరంగేట్రంపై లారెన్స్ స్పందించిన తీరు ఇప్పుడు చర్చకు దారితీసింది.

Raghava Lawrence Politics | రాజకీయాల వైపు అడుగులు ..

సోషల్ మీడియా వేదికగా లారెన్స్ ఒక వీడియోను విడుదల చేస్తూ తన మనసులోని మాటను పంచుకున్నారు. “నేను రాజకీయాల్లోకి వస్తానని ఎప్పుడూ ఊహించలేదు. రాజకీయాల ద్వారా డబ్బు సంపాదించాలనో, అధికారం దక్కించుకోవాలనో నాకు ఎప్పుడూ ఆశ లేదు. నాకు అత్యంత సన్నిహితుడైన ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు, వారికి మద్దతుగా ఉంటూ సామాజిక సేవను మరింత విస్తృతం చేయాలనుకున్నాను. కానీ ప్రస్తుత పరిస్థితులు నన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేశాయి” అని లారెన్స్ పేర్కొన్నారు.

larence.1

Raghava Lawrence Politics | ప్రజల నిర్ణయమే నా ఫైనల్ డెసిషన్..

తన రాజకీయ ప్రయాణం వెనుక ఉన్న ఆసక్తికరమైన విషయాలు, తన తల్లి అభిప్రాయాలు , తనను ప్రభావితం చేసిన ఘటనల గురించి ఆ వీడియోలో లారెన్స్ వివరంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు ఒక కీలక విజ్ఞప్తి చేశారు. ప్రజలు రాజకీయాల్లోకి రావద్దని భావిస్తే, తాను ఆ నిర్ణయాన్ని గౌరవిస్తానని, యధావిధిగా నిస్వార్థ సేవలను కొనసాగిస్తానని స్పష్టం చేశారు. ఒకవేళ ప్రజలందరూ రాజకీయాల్లోకి రావాలని ఆశీర్వదిస్తే, అందరి సహకారంతో కొత్త ప్రయాణాన్ని ప్రారంభించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

Raghava Lawrence Politics | కామెంట్ల రూపంలో తెలపాలని..

తన నిర్ణయంపై ప్రజలు, అభిమానులు తమ అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో తెలపాలని ఆయన కోరారు. లారెన్స్ చేసిన ఈ సంచలన ప్రకటనతో తమిళనాడు రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అన్నది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇది కూడా చదవండి:  Telangana Weather | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన

 

TAGGED:latest newsPolitical Entry NewsRaghava LawrenceRaghava Lawrence PoliticsTamil cinema newsTamil Nadu politicstelugu newsTrichy East By ElectionTVK partyVijay Tamil Nadu
ByShivam nagarani
Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Previous Article Telangana Weather Telangana Weather | నేడు పలు జిల్లాలకు భారీ వర్ష సూచన
Next Article Iran US Peace Deal  Iran US Peace Deal | ఇరాన్​తో యుద్ధం ముగిసింది.. ట్రంప్​ సంచలన ప్రకటన
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Digital Arrest Scams
జాతీయం

Digital Arrest Scams | డిజిటల్ అరెస్ట్ స్కామ్‌లకు కేంద్రం చెక్.. ఇక సైబర్ మోసగాళ్లకు చుక్కలే!

By Shashi kiran Mottala
Dharmapuri Arvind Call
తెలంగాణ

Dharmapuri Arvind | బండి సంజయ్ విషయంలో ఎందుకు మౌనం? ఎంపీ అరవింద్‌ను ఫోన్ కాల్‌లో నిలదీసిన మహిళ

By Shivam nagarani
Bengal Young Voters
జాతీయం

Bengal Young Voters | యువ ఓటర్ల చుట్టూ రాజకీయ హామీలు.. పశ్చిమ బెంగాల్​లో వారే 40 శాతం

By Naresh Chandan
AP Investment Projects
ఆంధ్రప్రదేశ్​

AP Investment Projects|ఏపీలో ప్రాజెక్టుల స్పీడప్.. మంత్రుల కమిటీకి చంద్రబాబు కీలక ఆదేశాలు

By Shivam nagarani
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.