అక్షరటుడే, నిజామాబాద్ సిటీ : World No Tobacco Day | యువత పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉండాలని వైద్యులు సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఇండియన్ డెంటల్ అసోసియేషన్ నిజామాబాద్ శాఖ (Nizamabad Branch) ఆధ్వర్యంలో ఆదివారం నగరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం గంజ్ ప్రాంగణంలో ఉచిత దంత వైద్య పరీక్షల శిబిరం ఏర్పాటు చేశారు.
ర్యాలీ సందర్భంగా ప్రజలకు పొగాకు, నికోటిన్ ఉత్పత్తులతో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించారు. ఐడీఏ అధ్యక్షుడు రఘు రావుట్ల, కార్యదర్శి సుగుణాకర్ రాజు, సీనియర్ సభ్యులు మాట్లాడారు. యువత పొగాకు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకోవాలని, క్రీడలను ప్రోత్సహించాలని సూచించారు.
World No Tobacco Day | శ్రద్ధ వహించాలి
గంజ్ ప్రాంగణంలో నిర్వహించిన ఉచిత దంత వైద్య శిబిరాన్ని నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ ముప్పా గంగారెడ్డి ప్రారంభించారు. ప్రజలు నోటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, పొగాకు వినియోగాన్ని పూర్తిగా మానుకోవాలని సూచించారు. శిబిరంలో పాల్గొన్న ప్రజలకు దంత ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి వైద్య సలహాలు అందజేశారు.
కార్యక్రమంలో సీనియర్ సభ్యులు నందకుమార్, ప్రతాప్ కుమార్, వ్యావహారే, శ్రీనివాస్, సాంబశివరావు పాల్గొన్నారు
ఇది కూడా చదవండి..: Fire Accident in Mendora | దేవుడి దీపంతో అగ్ని ప్రమాదం.. రెండిళ్లు దగ్ధం


