Crime Control Measures |  నేరాల నియంత్రణకు చర్యలు చేపట్టాలి : డీజీపీ ఆనంద్

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్: Crime Control Measures | రాష్ట్రంలోని పోలీసు అధికారులతో డీజీపీ (DGP) ఆదివారం సమీక్ష నిర్వహించారు. దీనికి సుమారు 6500 మంది అధికారులు హాజరయ్యారు.

ట్రాఫిక్, రోడ్డు భద్రత కోసం కొత్త విభాగాలు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని స్వీకరించే టెక్ బృందం, రెవెన్యూ లీకేజీలను నియంత్రించేందుకు ఒక విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్, ఆహార కల్తీ నిరోధక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రైమ్ మీటింగ్‌లు నిర్వహించడం, పోలీస్ స్టేషన్లు, ఇతర యూనిట్లను సందర్శించడం, తనిఖీలు చేయడం వంటి అంశాలపై వివరించారు. రాజకీయ ప్రతినిధులతో వ్యవహరించేటప్పుడు పాటించాల్సిన ప్రోటోకాల్ ప్రమాణాలను కూడా వివరించారు.

Crime Control Measures

Crime Control Measures | నిజాయితీతో..

పోలీసు అధికారులు నిజాయితీ ప్రమాణాలను పాటించాలని సీపీ కోరారు. ఎస్​హెచ్​వోల విధులు, బాధ్యతలను వివరించారు. బెటాలియన్, ఏఆర్ కమాండెంట్లు, ఏసీలు, ఆర్ఐల పాత్రను కూడా ప్రస్తావించారు. మారుమూల ప్రాంతాలలోని కొంతమంది SIలు, ఇన్‌స్పెక్టర్‌లు, SPలు మరియు CPలతో సంభాషించారు.

Crime Control Measures

 

ఇది కూడా చదవండి..: Kavitha Discom Allegations | డిస్కంలను ప్రైవేట్ పరం చేసే కుట్ర : కవిత

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *