Drunk Drive Checks | జిల్లాలో డ్రంకన్​​ డ్రైవ్​ తనిఖీలు.. వారంలోనే 162 మందికి జరిమానాలు

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Drunk Drive Checks | నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police) పరిధిలో డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలను పక్కాగా నిర్వహిస్తున్నామని సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ప్రకటన విడుదల చేశారు.

Drunk Drive Checks | వారం రోజుల్లో 162 మందికి జరిమానాలు..

గత వారం రోజుల్లో నిజామాబాద్ (Nizamabad), బోధన్ (Bodhan), ఆర్మూర్ (Armoor), ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్ల పరిధిలో ఈ తనిఖీలు జరిగాయని సీపీ తెలిపారు. ఇందులో భాగంగా 162 మంది మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించామన్నారు. అనంతరం వారిని ఆయా కోర్టులలో ప్రవేశపెట్టగా 160 మందికి రూ.16 లక్షల జరిమానాలు విధించారని ఇద్దరికి వారం రోజులపాటు కోర్టు జైలుశిక్ష విధించినట్లు ఆయన తెలిపారు.

Drunk Drive Checks | డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతర ప్రక్రియ..

జిల్లాలో డ్రంకన్​ డ్రైవ్ తనిఖీలు నిరంతర ప్రక్రియ అని మద్యం తాగి వాహనాలతో రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు. నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో తనిఖీలు నిరంతరం నిర్వహిస్తామని తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడపడం వల్ల వారితో పాటు ఇతరులకు సైతం ప్రాణహాని ఉన్నదని.. ఇలాంటివారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదన్నారు. తనిఖీల్లో పట్టుబడ్డ వారి లైసెన్స్​ను ఆర్నెళ్లపాటు సస్పెండ్ చేయడం జరుగుతుందని మద్యం తాగి వాహనాలు నడిపి రోడ్డు ప్రమాదం జరిగితే ఎలాంటి ఇన్సూరెన్స్ వర్తించదని తెలియజేశారు. మైనర్లు వాహనాలు నడుపుతూ ట్రాఫిక్ పోలీసులకు దొరికితే ఓనర్లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి: PCC Chief Comments | ‘మీడియా’ కథనాలపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *