SI Minor Driving | ఆరేళ్ల మనవరాలికి కారు డ్రైవింగ్​ నేర్పిస్తున్న ఎస్సై.. భారీగా ట్రాఫిక్​ జామ్

ఓ ఎస్సై తన ఆరేళ్ల మనవరాలికి కారు స్టీరింగ్​ ఇచ్చి ప్రధాన రోడ్డుపై డ్రైవింగ్​ నేర్పించాడు. ప్రశ్నించిన స్థానికులపై దబాయించాడు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SI Minor Driving | ట్రాఫిక్​ నిబంధనలు పాటిస్తూ.. ఇతరులకు ఆదర్శంగా నిలవాల్సిన ఓ ఎస్సై తన మనవరాలికి స్టీరింగ్​ అప్పగించాడు. మైనర్​ డ్రైవింగ్​తో జరిగే అనర్థాలపై అవగాహన కల్పించాల్సిన ఆయన ఆరేళ్ల బాలికకు డ్రైవింగ్​ నేర్పించడం గమనార్హం.

రంగారెడ్డి (Rangareddy) జిల్లాలో రద్దీగా ఉండే రోడ్డుపై ఓ ఎస్సై తన మనవరాలికి కారు నేర్పిస్తున్నాడు. ఆరేళ్ల చిన్నారిని డ్రైవింగ్​ సీటులో కూర్చొపెట్టి ఆయన పక్కన కూర్చున్నాడు. దీంతో ఆ బాలిక కారు నడుపుతోంది. ప్రధాన రహదారిపై కారు నెమ్మదిగా, అడ్డదిడ్డంగా వెళ్లడంతో భారీగా ట్రాఫిక్​ జామ్ అయింది. దీంతో పలువురు వాహనదారులు వచ్చి చూసే సరికి బాలిక కారు నడుపుతోంది. దీంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

SI Minor Driving | మా తాత ఎస్సై..

బాలిక కారు నడపడంపై అందులోని వ్యక్తిని వాహనదారులు ప్రశ్నించారు. దీంతో సదరు బాలిక వారిపై దురుసుగా మాట్లాడటం గమనార్హం. మా తాత ఎస్సై అని, కారు ఆపడానికి మీరెవరు అని సమాధానం ఇచ్చింది. తాము తప్పు చేసినా ఏం కాదనే భావన కొందరు అధికారులు, నాయకుల పిల్లల్లో ఉంటుంది. దానికి కారణం ఇలా పిల్లలను పెంచడమే అని పలువురు అంటున్నారు. ఆరేళ్ల బాలిక తన తాత ఎస్సై అని, ఎం చేసినా చెల్లుతుందని మాట్లాడటం ఇందుకు నిదర్శనం. సదరు ఎస్సై సైతం స్థానికులను దబాయించాడు. నా ఇష్టం, నన్ను అడగడానికి మీరెవరు అంటూ వారిపైనే ఆగ్రహం వ్యక్తం చేశాడు.

SI Minor Driving | చర్యలు తీసుకుంటారా..

మైనర్​లకు వాహనం ఇస్తే తల్లిదండ్రులకు జరిమానా, జైలుశిక్ష విధిస్తామని పోలీసులు నిత్యం ప్రచారం చేస్తుంటారు. అలాంటిది ఓ ఎస్సై నిబంధనలకు విరుద్ధంగా ఆరేళ్ల బాలికకు స్టీరింగ్​ అప్పగించాడు. మరి ఆయనపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. కాగా సదరు వాహనంపై 2020 నుంచి చలాన్లు పెండింగ్​లో ఉన్నాయి. మొత్తం రూ.4010 పైన్​ ఉంది. అయితే ఇతర వాహనదారుల నుంచి ముక్కుపిండి ఫైన్లు వసూలు చేసే పోలీసులు.. ఆ వాహనంపై ఆరేళ్లుగా జరిమానా వసూలు చేయకపోవడం గమనార్హం.

దీనిని కూడా చదవండి : Ferrari Car Crash | హైదరాబాద్​లో ఫెరారీ కారు బీభత్సం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *