అక్షరటుడే, వెబ్డెస్క్ : Osmania University Protest | ఉద్యోగుల సమస్యలను పట్టించుకోకుండా ఉస్మానియా యూనివర్సిటీ వీసీ ప్రభుత్వానికి గులాంగిరి చేస్తున్నారని తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kavitha) అన్నారు. సీఎంలతో కొట్లాడి యూనివర్సిటీ బాగు చేసుకున్న వీసీలు చరిత్రలో నిలిచిపోయారన్నారు. కానీ స్వార్థం కోసం విశ్వవిద్యాలయాల ప్రయోజనాలను తాకట్టు పెడుతూ ప్రభుత్వానికి గులాం గిరి చేసే వీసీలను చరిత్ర క్షమించదన్నారు.
ఓయూలో నాన్-టీచింగ్ స్టాఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) ఆధ్వర్యంలో చేపట్టిన మహా ధర్నాలో మంగళవారం కవిత పాల్గొన్నారు. ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. ఉద్యమాల ఖిల్లా అయిన ఓయూలో 35 ఏళ్లుగా ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ వచ్చినా.. ఉద్యోగుల జీవితాల్లో మార్పులు రాలేదన్నారు. అన్ని యూనివర్సిటీల్లో ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
Osmania University Protest | ముఖ్యమంత్రి ఎక్కడ
105 ఏళ్ల ఉస్మానియా చరిత్రలో మాదిగ బిడ్డను వీసీ చేశామని సీఎం గొప్పగా చెప్పుకుంటున్నారని, కానీ ఇస్తామని చెప్పిన వెయ్యి కోట్లు ఇవ్వకపోతే ఆయన మాత్రం ఏం చేస్తారన్నారు. నిధులు ఇవ్వకుండా వైస్ ఛాన్సలర్ ను బలి చేస్తారా? లేక ప్రభుత్వం కోసం ఆయనే ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారా అని ప్రశ్నించారు. ఓయూకు వచ్చి ఉద్యోగులు, విద్యార్థులను ఆదుకుంటామని చెప్పిన ముఖ్యమంత్రి ఎక్కడ పోయాడన్నారు. పోరాటం చేస్తున్న ఉద్యోగులను వీసీ ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. యూనివర్సిటీ విషయంలో గవర్నర్ స్పందించాలని కోరారు.
Osmania University Protest | స్థానికులకు అవకాశం ఇవ్వాలి
వర్సిటీలో నియమించిన సెక్యూరిటీ వాళ్లలో కూడా బీహార్, యూపీ వాళ్లే ఎక్కువగా ఉంటున్నారని కవిత అన్నారు. లోకల్ వాళ్లను 85 శాతం నియమించాల్సిన ఉన్నప్పటికీ ఎందుకు నియమించటం లేదని ప్రశ్నించారు. చనిపోయిన టైమ్ స్కేల్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ ఉద్యోగుల వ్యవస్థ తీసేసి అందరినీ పర్మినెంట్ చేయాలన్నారు. ఉద్యోగుల పోరాటానికి టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
గతంలో ఉస్మానియా యూనివర్సిటీలో సెక్యూరిటీ ఉద్యోగాల్లో 85 శాతం స్థానికులకు అవకాశాలు కల్పించేవారు. కానీ నేడు బీహార్, ఆంధ్రప్రదేశ్, ఒడిశా వంటి ఇతర రాష్ట్రాల నుంచి రిటైర్డ్ ఆర్మీ సిబ్బందిని తీసుకొచ్చి నియమిస్తున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో బయట రాష్ట్రాల వాళ్ళు ఉద్యోగాలు చేసే పరిస్థితి ఎందుకు వచ్చింది? మీ కుట్రల రక్షణ కోసమే వీళ్లను తెచ్చిపెట్టుకుంటున్నారనే ఆరోపణలపై వీసీ వెంటనే స్పందించాలి.
– తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) November 10, 2026
దీనిని కూడా చదవండి : Telangana Land Resurvey | పకడ్బందీగా భూముల రీసర్వే : మంత్రి పొంగులేటి