అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Bandi Sanjay Comments | సీఎం రేవంత్రెడ్డి (CM Revanth Reddy), మాజీ సీఎం కేసీఆర్పై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రేవంత్ రాహువు అని, కేసీఆర్ కేతువు అన్నారు. మంగళవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు.
సీఎం రేవంత్రెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సోమవారం బహిరంగ సభల్లో ప్రసగించిన విషయం తెలిసిందే. వారిపై బండి సంజయ్ స్పందించారు. కేసీఆర్, రేవంత్ భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో సీఎం రేవంత్రెడ్డి మాట మార్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని రోజుల్లో కేసీఆర్ కుటుంబంలో ఒక్కరిపైనా అయినా చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు.
Bandi Sanjay Comments | ఏటీఎంలా మారింది
కాళేశ్వరం ప్రాజెక్ట్ (Kaleshwaram Project) గతంలో బీఆర్ఎస్కు, ప్రస్తుతం కాంగ్రెస్కు ఏటీఎంలా మారిందని బండి సంజయ్ ఆరోపించారు. సీఎం సోమవారం మాట్లాడుతూ.. కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరిపించాలని ఇటీవల కేంద్రానికి లేఖ రాశామన్నారు. దీనిపై బండి స్పందిస్తూ.. ఆ లేఖలో ఏముందో చెప్పాలన్నారు. రూ.9వేల కోట్ల అవినీతిపై దర్యాప్తు జరపాలని సీఎం లేఖలో రాశారని, మరి రూ.లక్ష కోట్ల కుంభకోణం గురించి ఎందుకు లేఖ రాయలేదని ప్రశ్నించారు. రేవంత్రెడ్డి రాసిన లేఖను ఇంటింటికి పంచుతామని చెప్పారు.

Bandi Sanjay Comments | బీఆర్ఎస్తో కలవం
మహిళా రిజర్వేషన్ బిల్లు (Women’s Reservation Bill)ను ఇటీవల విపక్షాలు అడ్డుకోవడంపై కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష పార్టీలు వారి కుటుంబాల్లోని మహిళలకు పదవులు వస్తే మొత్తం మహిళలకు వచ్చినట్లు భావిస్తున్నాయని విమర్శించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోతే రేవంత్రెడ్డి సంబరాలు చేసుకోవడం సిగ్గు చేటన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఎప్పటికీ కలవవని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.
ఇది కూడా చదవండి..: Defence Liquor Seizure | రూ.10 లక్షల విలువైన డిఫెన్స్ మద్యం పట్టివేత

