అక్షరటుడే, వెబ్డెస్క్ : EV Auto Conversion | హైదరాబాద్ (Hyderabad)ను కాలుష్య రహిత నగరంగా తీర్చిదిద్దడానికి నగరంలో ఉన్న ఆటోలను ఈవీ వాహనాలుగా మార్చడానికి ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) తెలిపారు. కోర్ అర్బన్ రీజియన్లో ఉన్న ఆటోలకు ప్రభుత్వ నిధులతో రెట్రో ఫిట్టింగ్ చేయించడానికి 5 కంపెనీలతో చర్చలు జరుపుతున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ (Hyderabad) హజ్ హౌజ్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీఎం మాట్లాడారు. హజ్ యాత్రకు వెళ్తున్న వారికి ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలిపారు. మైనారిటీల సంక్షేమం, అభివృద్ధి విషయంలో ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల్లో మైనారిటీల భాగస్వామ్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు.
EV Auto Conversion | రూ.10 వేల అదనపు భారం
ఇరాన్ (Iran) యుద్ధం నేపథ్యంలో పెట్రోల్ రేట్లు పెరిగాయన్న కారణం చూపించి హజ్ యాత్రికులు ఒక్కొక్కరిపై రూ. 10 వేల అదనపు భారం మోపారని సీఎం తెలిపారు. చివరి నిమిషంలో తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా మంది భరించలేని పరిస్థితులు ఉన్నందున 7 వేల మంది హాజీలపై పడిన అదనపు భారం ప్రభుత్వం చెల్లించాలని నిర్ణయించినట్టు తెలిపారు. మైనారిటీల సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ప్రకటించారు.
ఇది కూడా చదవండి : Musi Project Works | రూ.7,055 కోట్లతో మూసీ ప్రాజెక్ట్ పనులు

