Musi Project Works | రూ.7,055 కోట్లతో మూసీ ప్రాజెక్ట్​ పనులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Musi Project Works | రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. విడతల వారిగా మూసీని ప్రక్షాళన చేస్తామని గతంలో సీఎం రేవంత్​రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా తొలిదశలో రూ.7,055 పనులు చేపట్టనున్నట్లు మంత్రివర్గ సబ్​ కమిటీ (Cabinet Sub Committee) తెలిపింది.

మూసీ ప్రాజెక్టుపై మంత్రివర్గ ఉపసంఘం శుక్రవారం భేటీ అయింది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రులు పొన్నం ప్రభాకర్​, శ్రీధర్​బాబు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్ట్​ డీపీఆర్​ వివరాలను అధికారులు అందజేశారు. తొలిదశలో పనుల కోసం ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంకు (ADB) నుంచి రుణం తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. బ్యాంక్​తో చర్చలు ముగిశాయన్నారు. తొలిదశలో నిర్మాణాలపై ప్రభావం లేని 5 కిలో మీటర్ల పనులు ప్రారంభించాలని మంత్రివర్గం ఉపసంఘం ఆదేశించింది. దీనికి రూ.రూ.7,055 కోట్లు అవుతాయని అంచనా వేశారు.

Musi Project Works | ప్రజలకు ఇబ్బందులు లేకుండా..

మూసీ సుందరీకరణతో అనేక నివాసాలు ఖాళీ చేయాలని ప్రభుత్వం గతంలో ఆదేశించింది. అయితే ఈ నిర్ణయంపై ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. నిర్మాణాలపై తక్కువ ప్రభావం పడేలా పనులు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు అలైన్‌మెంట్‌ మార్చాలని మంత్రులు అధికారులకు సూచించారు.

Musi Project Works | రబ్బర్​ డ్యామ్​ నమూనాలు

మూసీ పనులను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభించి 2027 డిసెంబర్‌ నాటికి పూర్తిచేయాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. ఎవరికీ ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని సూచించారు. వర్షాకాలంలో పనులకు ఆటంకం లేకుండా ముందుగానే చర్యలు చేపట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్​ సూచించారు. మూసీపై రబ్బర్‌ డ్యామ్‌ నమూనాలను అధికారులు మంత్రులకు చూయించారు.

దీనిని కూడా చదవండి : Secunderabad Love Murder | ప్రేమ వ్యవహారం.. బీటెక్​ విద్యార్థి దారుణ హత్య

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *